నిత్యావసర వస్తువుల పై జీఎస్టీ విధింపుకు వ్యతిరేకంగా రుద్రూర్ తెరాస నాయకుల నిరసన

రుద్రూర్(జనంసాక్షి):

నిత్యావసర వస్తువుల పై జీఎస్టీ విధింపుకు వ్యతిరేకంగా శుక్రవారం రోజున రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద తెరాస మండల నాయకులు రహదారిపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వనికి వ్యతిరేకంగా నినాదాలు చేసి, కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో జడ్పిటిసి నారోజీ గంగారాం, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అక్కపల్లి నాగేందర్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పత్తి లక్ష్మణ్, మాజీ సొసైటీ చైర్మన్ పత్తి రాము, టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బాల్ రాజ్, గ్రామ అధ్యక్షులు తోట్ల చిన్న గంగారాం, సొసైటీ చైర్మన్ బద్దం సంజీవరెడ్డి, , యువజన అద్యక్షులు కన్నె రవి, మాజీ ఎఎంసి చైర్మన్ బందెల సంజీవులు, రైతు సమన్వయ సమితి అద్యక్షులు తోట సంగయ్య, ఎఎంసి డైరెక్టర్ రామ గౌడ్, అంజయ్య, కో ఆప్షన్ మెంబర్ మస్తాన్, లాల్ మొహమ్మద్, జమీల్, సర్పంచ్ లు షేఖ్ ఖాదర్, లింగం బాపూజీ, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.