నిద్రావస్తలో జిల్లా ఆరోగ్యశాఖ.

అర్హత లేని ఆర్ఎంపి డాక్టర్  సెమి హాస్పిటల్ ను సీజ్ చేయాలి.
జిల్లా కలెక్టర్ స్పందించాలి.
కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు అంతటికాశన్న  డిమాండ్.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై..(జనంసాక్షి):
నాగర్ కర్నూల్ జిల్లా ఆరోగ్య శాఖ నిద్రావస్థలో ఉందని కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు అంతటికాశన్న అన్నారు. బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ కు కెవిపిఎస్ ప్రతినిధి బృందం సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు అనంతరం కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు అంతటి కాశన్న మాట్లాడుతూ
జిల్లా కేంద్రంలోని అర్హత లేని ఆర్ఎంపీ  డాక్టర్  మున్నాభాయ్ సమీ పేద ప్రజల ప్రాణాలను వారి అమాయకత్వంను ఆసరాగా చేసుకుని వచ్చిరాని వైద్యంతో  డబ్బులే లక్ష్యంగా ఆర్ఎంపి అవతారం ఎత్తి అమాయక ప్రజలను చంపుతున్నాడని అన్నారు.దీనిపై వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి హాస్పిటల్ ను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.ఆరోగ్యశాఖ అధికారులు నిద్రావస్థలో ఉండి ఆర్ఎంపీ డాక్టర్లు చేస్తున్న హత్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సెమీ డాక్టరు ప్రజలకు జ్వరం, దగ్గు,చిన్న చిన్న రోగానికి రకరకాల టెస్టులు చేసి వారి నుంచి వేల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు.  జిల్లా కేంద్రంలోని ఆర్ఎంపీ డాక్టర్లు ఇష్టానుసారంగా వైద్యం చేస్తూ ఎలాంటి అనుమతులు లేకుండా నడుపుతూ పేద ప్రజలను ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించాలని లేనిపక్షంలో జిల్లా మొత్తం ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కెవిపిఎస్  జిల్లా ఉపాధ్యక్షులు  భాస్కర్, శివ కుమార్, రాములు, కృష్ణ, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
Attachments area