అందరూ కలిసి కేంద్రంపై పోరాడాలి: తమిళనాడు సీఎం స్టాలిన్
-
హిందీ-సంస్కృతం.. 25 ఉత్తరాది భాషలను నాశనం చేశాయి
-
తమిళనాడులో ముదురుతున్న హిందీ వివాదం.. మరో భాషా యుద్ధానికి మేం సిద్ధమే.. స్టాలిన్
- హిందీ వ్యతిరేకోద్యమం దిశగా ప్రజలను ప్రేరేపించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య
హిందీ భాషకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం మధ్య వివాదం ముదురుతోంది. రాష్ట్ర హక్కుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమయిందని… అందరూ కలిసి కేంద్రంపై పోరాడాలని తమిళనాడు సీఎం స్టాలిన్ పిలుపునిచ్చారు. ఈరోజు తన జన్మదినోత్సం సందర్భంగా పార్టీ కార్యకర్తలకు ఈ మేరకు స్టాలిన్ బహిరంగ లేఖ రాశారు.
జాతీయ విద్యా విధానం పేరుతో హిందీ భాషను కేంద్రం మనపై బలవంతంగా రుద్దాలనుకుంటోందని స్టాలిన్ విమర్శించారు. పుట్టినరోజు వేడుకలను నిరాడంబరంగా జరుపుకోవడం తనకు అలవాటని… కానీ ఈసారి హిందీ వ్యతిరేకోద్యమం దిశగా ప్రజలను ప్రేరేపించాల్సిన అవసరం ఉందని… అందుకే పార్టీ శ్రేణులందరినీ కలుసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. మనం అప్రమత్తంగా లేకపోతే రాష్ట్రంలో హిందీ భాష రాజ్యమేలుతుందని, తమిళ భాష పత్తాలేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి మాట్లాడుతూ, త్రిభాషా విద్యా విధానం అత్యంత అవసరమని చెప్పారు.