నిధుల ఖర్చులో నిర్లక్ష్యం?

క్రీడల ప్రోత్సాహంలో ఉత్సాహం కరువు
ఆదిలాబాద్‌,మే5(జ‌నం సాక్షి): జిల్లా క్రీడల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఇందిరాప్రియదర్శి క్రీడా మైదానంలో రాత్రివేళల్లోనూ ఆయా ఆటలు ఆడుకునేలా సోలార్‌ వీధీ దీపాలను ఏర్పాటు చేశారు. యువకుల దేహదారుఢ్యం పెంపునకు ఉపయోగపడే వ్యాయామశాల ఆధునికీకరణకు అవసరమయ్యే పరికరాలను
తెప్పించారు. ఆయా పనుల కోసం నిధులను ఖర్చుచేసి  సద్వినియోగం చేసుకున్నారు. అయితే కొన్ని శాఖలు మాత్రం నిధులు ఖర్చు చేయడంలో వెనకంజ వేయడమే గాకుండా పనులలో నిర్లక్ష్యంగా ఉన్నాయి. ఆయాశాఖలు నిధులు వెచ్చింపులో అలసత్వం వహిస్తున్నట్లు ఆరోపనలు ఉన్నాయి.  కొంతమంది అధికారులు ప్రత్యేక చొరవ చూపడంతో ఆయా నిధులు సకాలంలో ఖర్చయి సదుపాయాలు సమకూరి, పలు ప్రయోజనాలు కలిగాయి. అందుబాటులో ఉన్న నిధులనే ఖర్చు చేసేందుకే అధికారులు నిర్లక్ష్యం చూపడం జిల్లా ప్రగతిపై వారికి ఏమేరకు చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలే వెనకబడిన జిల్లాగా ముద్రపడిన ఆదిలాబాద్‌లో నిధులు అందుబాటులో ఉన్నా ఖర్చుచేయని అధికారుల తీరును చూస్తుంటే.. అభివృద్ధి పనులకు వారే అడ్డంకిగా మారుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తాజావార్తలు