నిప్పుల కొలిమిలా ఎండల తీవ్రత

రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
పశువులు, కూలీలకు తీవ్ర ఇబ్బందులు
ఆదిలాబాద్‌,మే14(జ‌నం సాక్షి):  జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. వారం రోజుల నుంచి భానుడు ప్రచండతాపాన్ని చూపిస్తున్నారు. రోజు 44 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 7 నుంచి ప్రారంభమైన ఎండ వేడిమి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతోంది. మధ్యాహ్నం నిప్పులవాన కురిసినట్లుగా ఉంటుంది. సాయంత్రం వరకు అగ్నిగోళాన్ని తలపిస్తున్నాయి. ప్రధాన రోడ్లతో పాటు పలు వీధులు జనసంచారం లేక వెలవెలబోతున్నాయి. దినసరి కూలీలు, రోజువారీ పనులు చేసుకునే వారు తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఫలితంగా వారు వడదెబ్బ బారిన పడుతున్నారు. మూగజీవాల పరిస్థితి దయనీయంగా ఉంది. ఎండ నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు కూలర్లు, ఏసీలను ఆశ్రయిస్తుడటంతో వాటి వాడకం పెరిగింది. మజ్జిగ, పుచ్చకాయలు, కొబ్బరిబొండాలకు గిరాకీ ఎక్కువైంది. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు వాటి ధరలు పెంచేశారు. ఒక్కో కొబ్బరి బొండాను రూ.25కు విక్రయిస్తున్నారు.జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వారం రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు సైతం 30 డిగ్రీలు దాటుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఎండ తీవ్రత సాయంత్రం 6 గంటల వరకూ ఉంటుంది. వడగాలుల తీవ్రతతో జనం ఉక్కరిబిక్కిరవుతున్నారు. ఎండలకు వాడగాలులు తోడవడంతో ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఉక్కపోత తట్టుకోలేక ఉపశమనం కోసం నానా తంటాలు పడుతున్నారు.  జిల్లాలో మరికొన్ని రోజుల పాటు ఇలాంటి వాతావరణం ఉండనుండటంతో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసర సమయంలో మాత్రమే బయటకు వెళ్లాలని, డీహైడ్రైషన్‌ను గురికాకుండా చూసుకోవాలని వారు అంటున్నారు. ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. టోపీలు, ముఖానికి కాటన్‌ గుడ్డలు కట్టుకుని వెళ్తాన్నారు. వివిధ పనుల కోసం జిల్లా కేంద్రానికి వచ్చిన వారు చెట్ల కింద సేదతీరున్నారు. ఇళ్ల పై భాగంలో ఏర్పాటు చేసిన వాటర్‌ ట్యాంకులో నీరు ఎండ వేడిమికి కాగిపోతోంది. ప్రజలు తమ అవసరాల కోసం నీటిని వాడుదామనుకుంటే ముట్టుకునే పరిస్థితి లేదు. ఇళ్లలోని సామగ్రి సైతం ఎండవేడిమికి భగ్గుమంటోంది. ఎండ ప్రభావంతో పట్టణంలోని కొన్ని రోజులుగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎండ తీవ్రతకు వాహనదారులు రోడ్లపైకి రావాలంటనే భయపడుతున్నారు. దీంతో ప్రధాన రోడ్లతోపాటు వీధుల్లో జనసంచారం లేక వెలవెల బోతున్నాయి. మరి కొన్ని రోజుల పాటు ఎండలు, వడగాలుల తీవ్రత కొనసాగే అవకాశాలుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శరీరం అధిక ఉష్ణోగ్రతకు గురైనప్పుడు శరీరంలో నాడీ సమస్యలు తలెత్తుతాయి. సాధారణంగా మానవ శరీరంలో 70 శాతానికి పైగా నీరు నిల్వ ఉండాలి. ఎండల తీవ్రత కారణంగా శరీరంలోని నీర చెమట రూపంలో బయటకు వెళ్తుంది. దీంతో నీటి శాతం తగ్గి నాడులు సరిగా పనిచేయవు. శరీరంలో జరిగే రసాయన చర్యలతో అధిక వేడి ఉత్పత్తి అవుతుంది. ఎక్కువ చెమట పోవడంతో పాటు శరీరానికి వేడి తాకడంతో డీహైడ్రేషన్‌తో ఉపిరితిత్తులు సరిగా పనిచేయక వాంతులు విరేచనాలు అవుతాయి. దీంతో అపస్మారక స్థితికి చేరుకునే ప్రమాదం ఉంది. ఎండదెబ్బ బారినపడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

తాజావార్తలు