నిఫా వైరస్‌ కలకలం.

తగ్గిన పళ్ల వ్యాపారం
న్యూఢిల్లీ,మే28( జ‌నం సాక్షి ):  నిపా వైరస్‌ భయంతో దేవవ్యాప్తంగా ఆందతోళన వ్యక్తం అవుతోంది. పళ్ల ద్వారా ఇది వ్యాప్తి చెందుతుందన్న కారణంగా ప్రజలు పళ్లను కొనడానికి ముందుకు రావడంలేదు. ప్రధానంగా హైదరాబాద్‌ లాంటి నగరంలో తాటి ముంజల విక్రయాలు తగ్గాయి. గబ్బిలాలు కరిచిన పళ్లను తఇంటే వైరస్‌ రానుందని ప్రచారం సాగుతోంది. రంజాన్‌ సీజన్‌ అయినా పండ్ల విక్రయాలు గణనీయంగా తగ్గాయి.  గత వారంరోజుల్లో ముంబై నగరంలో పండ్ల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. పక్షులు, గబ్బిలాలు కొరికిన పండ్లు తినడం వల్ల నిపా వైరస్‌ వ్యాప్తి చెందుతుందని, దీనివల్ల పండ్లు తినవద్దని వైద్యనిపుణులు సూచించడంతో ఒక్కసారిగా పండ్ల విక్రయాలు తగ్గిపోయాయి. కేరళ, కర్ణాటక రాష్ట్రాల  నుంచి  మామిడికాయలు తెప్పించి విక్రయించేవారు వ్యాపారాలు లేక డీలా పడ్డారు.  నిపా వైరస్‌ పుణ్యమా అంటూ ముంబై నగరంలో ప్రజలు పండ్ల దుకాణాల వైపు చూడటం లేదని పండ్ల వ్యాపారులు ఆవేదనగా చెప్పారు. ఉన్న పండ్లను ధరలు తగ్గించి విక్రయిస్తున్నామని  చెప్పారు. కొనేవారు కొరవడటంతో పండ్ల ధరలు గణనీయంగా తగ్గాయి. మామిడిపండ్లు కిలో 80 నుంచి 40 రూపాయలకు తగ్గాయి. రసపురి మామిడి కిలో 20రూపాయలకే విక్రయిస్తున్నారు. పుచ్చకాయలు కిలో రూ.16, పైనాపిల్‌ రూ.25లకే విక్రయిస్తున్నారు. కాగా పోషకాహారంలో భాగమైన పండ్లను తినేటపుడు వాటిని బాగా కడిగి తినాలని డాక్టర్లు సూచించారు. చిలుక కొట్టిన పండ్లు తినకుండా ఉండాలని కోరారు.