నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం తీరు
హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో నిబంధనలను పాతర వేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మండిపడ్డారు. సభా వ్యవహారాల మండలిలో ఏ పార్టీలో ఎవరుండాలనేది ప్రభుత్వం నిర్ణయించడం ఎంతవరకు సమంజసమని ఆయన విమర్శించారు. ఆయన మాట్లాడుతూ.. శాసనసభ తీరు నిబంధనలకు పాతర వేసే విధంగా ఉందన్నారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని మాట్లాడనీయకుండా చేసి.. ఆ ఆరోపణలు మార్చి చివరకు దళితుడ్ని అవమానించారంటున్నారని అన్నారు. అఖిలపక్షంలో వీటిపై చర్చించి తమ సభ్యుడు నడుచుకుంటాడని.. రేవంత్ అసభ్యంగా మాట్లాడితే రికార్డ్ నుంచి తొలగించాలని లేదా స్పీకర్ కు రూలింగ్ ఇవ్వాలన్నారు. ఒక సభ్యుడ్ని మాట్లాడనివ్వకుండా, టీడీపీని గొంతునొక్కడమేనని సండ్ర తెలిపారు.