నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..

` పోలింగ్‌ రోజు కార్యాలయాలకు సెలవులు
` ప్రభుత్వ,ప్రైవేట్‌ సంస్థలు ఆరోజు ఉద్యోగులకు విధిగా సెలవు ఇవ్వాలి
` ఇవ్వని సంస్థలపై చట్టప్రకారం చర్యలు
` అమల్లోకి వచ్చిన 144 సెక్షన్‌
` సీఈవో వికాస్‌ రాజ్‌ ఆదేశాలు
హైదరాబాద్‌,నవంబర్‌28(జనంసాక్షి):తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ రాజ్‌ చెప్పారు.13 నియోజకవర్గాల పరిధిలో నాలుగు గంటలకే ఎన్నికల ప్రచారం ముగిసింది. సైలెంట్‌ పీరియడ్‌ ప్రారంభమైందన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైందని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఆయన విూడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.26 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. వారిలో 1,62,98,418 మంది పురుషులు, 1,63,01,750 మంది మహిళా ఓటర్లు ఉన్నారని తెలిపారు. థర్డ్‌ జెండర్‌ ఓటర్లు 2,676 మంది, సర్వీస్‌ ఓటర్లు 15,406, ఓవర్సీస్‌ ఓటర్లు 2,944 మంది ఉన్నారని వికాస్‌ రాజ్‌ తెలిపారు.119 నియోజకవర్గాల్లో 2290 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారని వికాస్‌ రాజ్‌ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,356 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర పోలీసులతోపాటు కేంద్ర బలగాలు ఎన్నికల విధులు నిర్వహిస్తున్నాయని అన్నారు. ఎన్నికల విధుల్లో లక్ష మంది పాల్గొంటున్నారని అన్నారు. తెలంగాణ పోలీసులు 65వేల మంది, 18 వేల మంది హోంగార్డులు ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. మొత్తం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విధుల్లో లక్ష మంది భద్రతా సిబ్బంది పాల్గొంటున్నారని అన్నారు. 375 కంపెనీల కేంద్ర బలగాలు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారన్నారు. స్థానికేతరులు నియోజకవర్గాలను వదిలి వెళ్లాలని స్పష్టం చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా 19,375 ప్రాంతాల్లో పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని వికాజ్‌ రాజ్‌ చెప్పారు. బుధవారం సాయంత్రం నుంచి పోలింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లోకి వస్తుందని తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల సవిూపంలో ప్రచారం నిలిపేయాలని స్పష్టం చేశారు. అలాగే సోషల్‌ విూడియా, ఎలక్ట్రానిక్‌ విూడియాలో ప్రచారం నిలిపేయాలని చెప్పారు. రేపు ఎన్నికల సిబ్బంది సామగ్రి పంపిణి చేస్తాం అని వికాస్‌ రాజ్‌ చెప్పారు. పోలింగ్‌ సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ ఉపయోగించుకుంటున్నారని అన్నారు. ఇక వివిధ పార్టీల పోలింగ్‌ ఏజంట్లు ఉదయం 5.30 గంటలకు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకోవాలని స్పష్టం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా 250కి పైగా, అంతర్‌ రాష్ట్ర సరిహద్దుల్లో 166 చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు ఏర్పడకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మావోయిస్టులు ఎన్నికల బహిష్కరణకు పిలుపునివ్వడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో అదనపు భద్రతా సిబ్బందిని నియమించారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద ఐదంచెల భద్రత ఉంటుందన్నారు. 10 వేలకు పైగా సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయన్నారు.ఎన్నికల నేపథ్యంలో బుధ, గురు వారాల్లో హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని విద్యా సంస్థలకు జిల్లా కలెక్టర్‌ సెలవు ప్రకటించారు. పోలింగ్‌ ముగిసిన తర్వాత అర్థ గంట వరకూ ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రచురణపైనా నిషేధం విధించారు. ఈ నెల 30న పోలింగ్‌, వచ్చే నెల మూడో తేదీన కౌంటింగ్‌ జరుగనున్నది. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాల నిఘా ఉంటుంది. 50 శాతం పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ క్యాస్టింగ్‌ ఉంటుందని వికాస్‌ రాజ్‌ చెప్పారు.పోలింగ్‌ ముగిసిన తర్వాత అర్థ గంట వరకూ ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రచురణపైనా నిషేధం విధించారు. ఈ నెల 30న పోలింగ్‌, వచ్చే నెల మూడో తేదీన కౌంటింగ్‌ జరుగనున్నది. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాల నిఘా ఉంటుంది. 50 శాతం పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ క్యాస్టింగ్‌ ఉంటుందని వికాస్‌ రాజ్‌ చెప్పారు. 4000 క్రిటికల్‌ పోలింగ్‌ కేంద్రాల పరిధిలో అదనపు సిబ్బందిని నియమిస్తామన్నారు. పోలింగ్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూమ్‌ లను భద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకుంటారని వెల్లడిరచారు.ఏ రాజకీయ పార్టీ ఎటువంటి ప్రచారం చేయకూడదని వికాస్‌ రాజ్‌ స్పష్టం చేశారు. నగదు, మద్యం సరఫరా నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ రూ.709 కోట్ల నగదు జప్తు చేశామని చెప్పారు. సమస్యాత్మక, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అదనపు భద్రతా బలగాలను నియమిస్తామన్నారు. సినిమాలు, సోషల్‌ విూడియాలో ప్రచారంపై నిషేధం అమల్లో ఉంటుందన్నారు.
పోలింగ్‌ రోజు కార్యాలయాలకు సెలవులు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో అంటే.. నవంబర్‌ 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలు సెలవు ప్రకటించాలని ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాలు జారీ చేశారు. ఆయా కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని సంస్థలు సెలవు ఇవ్వాని ఆదేశించారు. సెలవు ఇవ్వని సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత ఎన్నికల వేళ  కొన్ని సంస్థలు సెలవు ఇవ్వనట్లు తమకు ఫిర్యాదులు అందినట్లు సీఈవో తెలిపారు. ఈ మేరకు ఈ ఎన్నికలకు అన్ని సంస్థలు సెలవు ఇచ్చాయో లేదో పరిశీలించాలని కార్మిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఎన్నికల దృష్ట్యా హైదరాబాద్‌ నగరంలోని అన్ని విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. బుధ, గురువారాల్లో జిల్లా పరిధిలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్‌ 30వ తేదీన తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ రోజున అంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌  సూచించారు. ఎన్నికలు జరిగే రోజున తెలంగాణలోని అన్ని ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలు సెలవు ప్రకటించాలని సీఈవో వికాస్‌ రాజ్‌ ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆ కంపెనీలు హాలిడే ప్రకటించాలన్నారు. సెలవు ఇవ్వని సంస్థలు, కంపెనీలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తంలో జరిగిన ఎన్నికల్లో కొన్ని ఐటీ, ప్రైవేట్‌ కంపెనీలు సెలవు ఇవ్వలేదని తమకు ఫిర్యాదులు వచ్చాయన్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికల రోజున సంస్థలు సెలవులు ఇవ్వకపోవడంతో ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. నవంబర్‌ 30న ఎన్నికల రోజు అన్ని సంస్థలు హాలిడే ఇస్తున్నాయో లేదో పరిశీలించి, సెలవు ఇవ్వని కంపెనీ యాజమాన్యంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖకు తెలంగాణ సీఈవో వికాస్‌ రాజ్‌ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నవంబరు 29, 30 తేదీల్లో పాఠశాలలకు  ప్రభుత్వం సెలవు ప్రకటించింది. గరంలోని పలు విద్యాసంస్థల్లో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నవంబరు 29న ఆయా పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల సామగ్రిని తరలించన్నారు. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు. డిసెంబర్‌ 1న మళ్లీ స్కూళ్లు, కాలేజీలూ తెరచుకోనున్నాయి. తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది. హైదరాబాద్‌ నగరంలో 144 సెక్షన్‌ అమల్లోకి వచ్చిందని సీపీ సందీప్‌ శాండిల్య తెలపారు. ఎన్నికల ముగిసే వరకు మద్యం దుకాణాలు బంద్‌ ఉంటాయని పేర్కొన్నారు. మూడు రోజులపాటు మద్యం అమ్మకాలు నిలిపివేస్తూ హైదరాబాద్‌ సీపీ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ముగిసేవరకు 144 సెక్షన్‌ కొనసాగుతుందని సీపీ వెల్లడిరచారు. ఐదుగురికి మించి ఎక్కడైనా గుమ్మిగడితే చర్యలు తప్పవని సీపీ తెలిపారు. బార్లు, వైన్‌ షాపులు, పబ్బులు మూసివేయాలని సీపీ ఆదేశాలు ఇచ్చారు. మూడు రోజులపాటు మద్యం అమ్మకాలపై ఆంక్షలు విధించారు.