నియోజకవర్గంలో దాటిన అభిమానం…….
టేకుమట్ల.ఆగస్టు(జనంసాక్షి)భూపా లపల్లి నియోజకవర్గం దాటిన అభిమానం పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామ సర్పంచ్,తెలంగాణ రాష్ట్ర నాయకుడు నీలం మధు కు టేకుమట్ల మండలంలోని రాఘవరెడ్డిపేట గ్రామానికి చెందిన కొలుగూరి వెంకటేష్ అనే యువకుడు వీరాభిమానిగా మారాడు.బుధవారం హైదరాబాద్‌లోని పటాన్చెరులో తన నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానం చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ పటాన్చెరు మండల అభివృద్ధికి ఆయన ఎంతగానో అహర్నిశలు కష్టపడుతూ యువతకు ఆదర్శంగా నిలుస్తూ అశోకుడు దానంలో కర్ణుడు ఆపదలో ఆపద్బాంధవుడిగా ఉంటూ చిట్కుల్ గ్రామంతో పాటు నియోజకవర్గ సమస్యలతో అందరినీ తన వాళ్లు అనుకుంటూ తనదైనశైలిలో పలకరిస్తూ ఎల్లవేళలా ప్రజలకు తోడుగా ఉన్న తనపై అభిమానాన్ని పెంచుకున్నాని హర్షం వ్యక్తం చేశాడు.