నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా టేకులపల్లి లో నరేంద్రమోదీ, కిషన్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

టేకులపల్లి, సెప్టెంబర్ 27( జనం సాక్షి ): కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలనలో తెలంగాణ మీద కక్షపూరితంగా ప్రవర్తిస్తూ కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి బయ్యారం ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదని ప్రకటించడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా టిఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. మంగళవారం ఇల్లందు శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ ఆదేశానుసారం టేకులపల్లి మండల టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో టేకులపల్లి మండల టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బోడ బాలు నాయక్ అధ్యక్షతన ప్రధాన రహదారి బోడు రోడ్ సెంటర్ లో ప్రధాని మోదీ కిషన్ రెడ్డి ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బానోతు హరిసింగ్ నాయక్, ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు (డివి) పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బయ్యారం పరిశ్రమ నెలకొల్పడానికి అందుకు కావలసిన ముడి సరుకులు పుష్కలంగా ఉన్నాయని, పరిశ్రమ స్థాపనతో పదివేల ఉద్యోగాలు లభిస్తాయని ఆనాడు పలువురు చేసిన సర్వేలలో బయ్యారంలో పరిశ్రమ నెలకొల్పడానికి అన్ని రకాలుగా అర్హతలు ఉన్నాయని తెలిపారు అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశి పూర్వకంగానే ఉక్కు పరిశ్రమ స్థాపన సాధ్యం కాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొనడం తెలంగాణ ప్రజల పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి కనపడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్నే సకల జనుల సమ్మెతో కేసీఆర్ నాయకత్వాన్ని ప్రత్యేక రాష్ట్రమైన తెలంగాణను సాధించుకున్న విధంగానే ఉక్కు పరిశ్రమలు కూడా సాధించుకు తీరుతామని అందుకు కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ�