నిరంతర విద్యుత్ ఘనత సిఎం కెసిఆర్‌దే
సంక్షేమ పథకాలు కొనసాగాలంటే టిఆర్‌ఎస్ గెలవాలి ఎర్రబెల్లి
జనగామ,నవంబర్15(జనంసాక్షి): తెలంగాణలో నిరంతరంగా 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తోంది సిఎం కెసిఆర్ మాత్రమేనని పాలకుర్తి టిఆర్‌ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సంక్షేమ కార్యక్రమాలను, రైతు కార్యక్రమాలను అమలు చేస్తున్నది కూడా తెలంగాణ ప్రభుత్వం మాత్రమే నన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. రైతులకు ఎకరానికి రూ.8 వేల పెట్టుబడి, సీఎం కేసీఆర్‌ది ప్రజలందరికీ పారదర్శకంగా నిలిచే రామరాజ్య పాలన అని అన్నారు. రైతులు ఏవిధంగా మరణించినా రూ, 5 లక్షల బీమా అందిస్తోంది కేసీఆరే నన్నారు. రైతులకు రూ. లక్ష లోపు రుణాలను మాఫీ చేశామన్నారు. ఆ పథకానికి మార్పులు చేసి రూ.రెండు లక్షలకు పెంచుతూ మేనిఫెస్టోలో పొందు పరుస్తున్నామని, సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని ఆయన వివరించారు. మిషన్ కాకతీయలో చెరువులను అభివృద్ధి పరచారన్నారు. చెరువులకు నీళ్లు కావాల్నా.. రైతుబీమా కావాలన్నా.. కెసిఆర్ రావాలే అంటూ ప్రజలతో మమేకమై ప్రచారం తనదైన శైలిలో నిర్వహించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఓవైపు సంక్షమ పథకాలను అమలు చేస్తూనే అభివృద్ధిలోనూ అగ్రగామిగా రాష్ట్రాన్ని నిలుపుతున్నారన్నారు. ప్రజలు కేసీఆర్ సేవలకోసం కారుగుర్తుపై ఓటు వేయాలన్నారు. ఇకపోతే అన్ని వర్గాల వారికి చేయూత నందిస్తున్న సీఎం కేసీఆర్ ముదిరాజ్ కులస్తుల ఆత్మగౌరవం పెంచారని అన్నారు. డిసెంబర్ 7న జరగబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి వస్తున్న మహాకూటమిని ఓడించాలని ప్రజలను కోరారు. నాలుగున్నరేళ్ల కాలంలోనే దేశంలోనే అభివృద్ధి పరంగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్‌వన్ స్థానంలో నిలిపి ఉత్తమ సీఎంగా గు ర్తింపు పొందారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వృద్ధులకు వెయ్యి, వికలాంగులకు రూ.1500 పింఛన్లు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. తెలంగాణలో మరింత అభివృద్ధి జరుగాలంటే కేసీఆర్ సీఎం కావాలని, ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలని ఆయన కోరారు.