నిరసన దీక్షకు వెళ్తున్న కాంగ్రెస్ నాయకుల అరెస్ట్
లింగంపేట్ 21 జూలై (జనంసాక్షి)
సోనియాగాంధీని ఈడి అక్రమ అరెస్టు చేయడం దౌర్జన్యమైన చర్యఅని లింగంపేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు నల్లమడుగు షరీఫ్ అన్నారు.సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతు గురువారం సోనియాగాంధీ అక్రమ అరెస్టుకు నిరసనగా హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిరసన కార్యక్రమానికి వెళుతున్న మా కాంగ్రేస్ కార్యకర్తలను లింగంపేట్ పోలీసులు హౌజ్ అరెస్ట్ చేసారన్నారు.ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల గొంతు నొక్కడం దుర్మార్గమైన చర్యఅని ఆయన దుయ్యబట్టారు.అరెస్ట్ అయిన వారు లింగంపేట్ ఎస్సి సెల్ వైస్ ప్రెసిడెంట్ సిద్దు కాంగ్రెస్ నాయకులు పాష మోహన్ యూత్ అధ్యక్షుడు మధుర గోవింద్ ఎస్సి సెల్ అధ్యక్షులు పూల్ సింగ్ మహమ్మద్ సాజిత్ మిరాజ్ నరేష్ కార్యకర్తలున్నారు