నిరుద్యోగులు శిక్షణ పొందాలి
మహబూబాబాద్, నవంబర్ 11(జనంసాక్షి):
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో స్కిల్ ప్రో ఎడ్యుటెక్ ఇండియా ఆధ్వర్యంలో నిరుద్యోగులకు శిక్షణనివ్వనున్నట్లు సంస్థ మేనేజర్ సారన సతీష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగులకు కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్, సేల్స్ అసోసియేట్, ఇన్‌స్టోర్ ప్రమోటర్, జనరల్‌డ్యూటీ నర్సింగ్‌లలో శిక్షన ఇవ్వనున్నామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ ఎస్సెస్సీ మెమో, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డుతో పాటు నాలుగు ఫోటోలతో స్థానిక చేపల మార్కెట్ ఎదురుగా ఉన్న తమ ఇనిస్టిట్యూట్‌లో సంప్రదించాలని కోరారు. వివరాలకు 7013143133, 8790721755, 9052341086లలో సంప్రదించాలని కోరారు.