నిరుపేదలకు ఇండ్లు నిర్మిస్తూ, అనేక సామాజిక సేవల్లో దాతృత్వం చాటుకుంటున్న కంది కృష్ణ చైతన్య
ఇంటిని”జడ్పీ ఫోర్ లీడర్ పెద్ది స్వప్న ” చే ప్రారంభోత్సవం చేయించిన కృష్ణ చైతన్య.
జనం సాక్షి, చెన్నరావు పేట
చెన్నారావుపేట మండల యువ నాయకుడు, సాఫ్ట్ వెర్ వృత్తిని కొనసాగిస్తూ, ప్రజాసేవలో ముందుంటూ, అందరి అభిమానాలను చూరగొంటున్న కృష్ణ చైతన్య.
కరోనా కష్టకాలంలో అనేక కుటుంబాలకు చేయూతనందించి ఆదుకున్నారు. చెన్నారావుపేట మండలంలో నిరుపేదల కుటుంబాలకు చెందినవారు ఎవరు మరణించిన వారికి బియ్యంతో పాటు ఆర్థిక సాయం చేస్తూ వస్తున్నారు.
ఇలా అనేక సామాజిక కార్యక్రమాలు చేయడంలో ముందుంటూ, మంచి పేరు తెచ్చుకుంటూ ఎమ్మెల్యే పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటు,చెన్నారావుపేట పట్టణంలో నిరాశ్రయులైన నిరుపేదలకు ఇండ్లు నిర్మించే క్రమంలో ప్రారంభించిన ఇల్లు మూడోది.కాగ గతంలో నిరుపేదలైన
ధరంసోత్ సుమన్ రాథోడ్, రొడ్డ రాజాలుకి చెరొక ఇల్లు చొప్పున ఒక్కో ఇంటికి సుమారు ఒక లక్షా డెబ్భై వేల నుండి రెండు లక్షల రూపాయల విలువ గల ఇంటిని తన సొంత డబ్బులతో నిర్మించి ఇచ్చి దాతృత్వం చాటుకున్న కృష్ణ చైతన్య.
మర్రి మల్లయ్య-లక్ష్మి ల కొరకు నిర్మించిన ఇంటిని నేడు కృష్ణ చైతన్య జన్మదిన సందర్భంగా జడ్పీ ఫ్లోర్ లీడర్ చెన్నారావుపేట మండల నాయకులు, ప్రజాప్రతినిధులచే ప్రారంభింపజేసి వృద్ధ దంపతులైన మర్రి మల్లయ్య-లక్ష్మి లకు కానుకగా ఇచ్చారు.అనేక రకాలుగా సామాజిక సేవల0దిస్తున్న కృష్ణ చైతన్య ని ఈ సందర్భంగా పెద్ధి స్వప్న అభినందించారు.ఈ కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్ లీడర్తో పాటు చెన్నారావుపేట మండల జడ్పిటీసి పత్తి నాయక్, మండల పార్టీ కన్వీనర్ కంది కృష్ణారెడ్డి, నాయకులు బుర్రి తిరుపతి, కో ఆప్షన్ మహమ్మద్ రఫీ, జున్నుతల రామ్ రెడ్డి, సర్పంచ్ కుండే మల్లయ్య, గ్రామ పార్టీ అధ్యక్ష్యులు కందకట్ల సాంబయ్య, అమీనాబాద్ పిఎసిఎస్ చైర్మన్ మురహరి రవి, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.