నిరుపేద ముస్లింలకు నిత్యవసర వస్తువుల పంపిణీ

కమలాపూర్‌, జూలై 31 (జనంసాక్షి) : కమలాపూర్‌ మండల పరిధిలోని కాశీంపల్లి గ్రామంలో మంగళవారం ఇప్తూల్‌ ఖురాన్‌ చారీటబుల్‌ ట్రస్టు రూరల్‌ ఇస్లామిక్‌ సెంటర్‌ కరీంనగర్‌ వారి ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్‌ షేక్‌ అబుబూకార్‌ ఖాలీద్‌ మాట్లాడుతూ పవిత్ర రంజాన్‌ మాసంలో పండుగలు నిరుపేద ముస్లింలు అందరి లాగానే జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ సంస్థ గత 5 సంవత్సరాలుగా ధనిక ముస్లింల వద్ద విరాళాలు సేకరించి, పేద ముస్లింల కుటుంబాలకు అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. గ్రామంలో 95 కుటుంబాలకు 25 కిలోల బియ్యం, నిత్యవసర వస్తువులైన 13 రకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్‌ మాజీ ఈద్గా అండ్‌ మేనేజ్‌మేంట్‌ జిల్లా అధ్యక్షుడు ముజాయిద్‌ హుస్సేన్‌, ట్రస్టు అధ్యక్షుడు గయాసోద్దీన్‌, రబ్బాని, సయ్యద్‌ అలీలు పాల్గొన్నారు.