నిరుపేద విద్యార్థిని జీవితంలో వెలుగులు.
ఆర్థిక సహాయం అందజేసిన డాక్టర్ సంపత్ కుమార్.
తాండూరు అక్టోబర్ 22(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా యాలాల మండలం అగ్గనూర్ అనుబంధ గ్రామమైన మల్‌రెడ్డిపల్లి లోని నిరుపేద విద్యార్థిని గొల్ల శిరీష ఆర్థిక స్థోమత లేక ఇంటర్ అనంతరం మధ్యలోనే చదువు నిలిపివేసింది.
అయితే పరిస్థితి ఆ గ్రామ ఉపాధ్యాయుడు పిఆర్.టి.యు వికారాబాద్ జిల్లా గౌరవధ్యక్షులు వెంకట్ రామ్ రెడ్డి శ్రీ బాలాజీ నర్సింగ్ హోమ్ వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో వెంటనే స్పందించిన డాక్టర్ సంపత్ కుమార్ విద్యార్థినికి ఆర్థిక సహాయం అందజేస్తూ… అడ్మిషన్ కు చివరి రోజు శనివారం కావడంతో శాలివాహన కళాశాలలో బీకాం కంప్యూటర్ మొదటి సంవత్సరం ప్రవేశం కల్పించారు. నిరుపేద తెలివైన విద్యార్థిని జీవితంలో వెలుగులు నింపిన డాక్టర్ సంపత్ కుమార్ దాతృత్వానికి పిఆర్ టియు టిఎస్ యాలాల్ మండల శాఖ
సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. నిరుపేద విద్యార్థినికి జీవితంలో వెలుగులు నింపారని, సహకరించిన సంఘం జిల్లా గౌరవాధ్యక్షుని కృషిని సంఘం అధ్యక్ష కార్యదర్శులు శ్రీధర్‌రెడ్డి, యాదయ్యగౌడ్ లు కొనియాడారు.
Attachments area