నిరుపేద వృద్ధ మహిళలకు బ్లాంకెట్ల పంపిణీ.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 8. (జనం సాక్షి) షిరిడి సాయి పర్తి సాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలురు నిరుపేద వృద్ద మహిళలకు బ్లాంకెట్లను పంపిణీ చేశారు. మంగళవారం కార్యక్రమానికి హాజరైన సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి అధ్యక్షులు బియ్యం కార్ శ్రీనివాస్ మాట్లాడుతూ నిరుపేదలకు చేయూత అందిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ట్రస్టు నిర్వాహకులను అభినందించారు. మానవత దృక్పథంతో సామాజిక సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావలసిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు చీకోటి అనిల్ కుమార్, మంగళారం రమేష్ తదితరులు పాల్గొన్నారు