నిర్మల్ ప్రాజెక్టులపై నేడు హరీష్ రావు సవిూక్ష
నిర్మల్,జూలై9(జనం సాక్షి): జిల్లాలో నిర్మితమవుతున్న ప్రాజెక్ట్‌లపై సవిూక్ష జరిపేందుకు ఈనెల 10న మంగలవారం మంత్రి హరీశ్ రావు జిల్లాకు రానున్నట్లు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు మరమ్మత్తు పనులు చేపట్టడం జరిగిందన్నారు. దీంతో చివరి ఆయకట్టుకు సాగునీరు అందే అవకాశాలున్నాయన్నారు. అలాగే కాళేశ్వరం ప్యాకేజీ నంబర్ 27, 28ల కింద జిల్లాలో చేపడుతున్న హైలెవెల్ కెనాల్ నిర్మాణం ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందన్నారు. నిర్మల్ జిల్లా సోన్ మండలం సాకెర, కడ్తాల్ సవిూపంలో జరుగుతున్న సరస్వతీ కెనాల్ మరమ్మత్తు పనులను ఆయన పరిశీలించారు. రైతులతో ముచ్చటించారు. ఇదిలావుంటేబాసర వద్ద గోదావరి నదికి హారతి ప్రారంభించి ఆదివారం 250 రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా వేదపాఠశాల తరుపున ఆదివారం రాత్రి ఘనంగా గోదావరి హారతి ఇచ్చారు. సాయంత్రం నది వద్ద ప్రత్యేక పూజలు చేసి అనంతరం రాత్రి 200 మంది వేదపాఠశాల విద్యార్థులతో హారతి నిర్వహించారు. కార్యక్రమానికి బాసర గ్రామస్థులతో పాటు చుట్టుపక్కల గ్రామస్థులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఇదిలావుంటే సాగునీటి రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు.