నిశ్శబ్దం లో శబ్దం….

నిశ్శబ్దంలో శబ్దం ఏదో ఆలోచనలు చేస్తుంది
అంతరంగం మౌనం గా మాటలు వింటూంది
మస్తిష్కం లో రూపం ఒకటి పలకరించే
కాలం కరిగించిన జ్ఞాపకాల దారుల్లో…
కరిగిన యవ్వనం కదిలించే
ముదిరిపోయిన ఫలం గుర్తుచేస్తూ
రాలిపోయే పువ్వు చిన్నారి లా నవ్వుతూ
చిద్విలాసంగా చిరు జీవితం ముగించే…
క్షణం క్షణం కల ప్రసవం జరుగుతుంది
అద్భుతాలు సృష్టిస్తూ ముందుకు సాగుతూ
నిత్య ప్రసవవేదన ఒక కాలానికి చెందుతుంది
నిత్యము నవయవ్వనంతో తిరుగుతూ ఉంటుంది…
ప్రకృతిలో నిండుగా ఉన్నాది మానవత్వం
సకల జీవులకు స్తన్యము ఇస్తుంది
నేలమ్మ సింగారానికి ఆకాశమే అవకాశం కల్పించే
మట్టి పరిమళాలకు మోజు పడి వసంతం కురిపించే..
నిండుగ ఉండే సముద్రం
గర్భంలో సకల సృష్టికి మూలం వహించే
ఎగిసే అలలు చల్లబడుతూ ఉన్నా
లోపలి మూలాలకు కదలిక పుట్టించే…
నింగిలో చీకటి రూపము స్పష్టం
సృష్టి రహస్యాలను విప్పి చూపేందుకు
శూన్యంలో వెలుగులు విరజిమ్మే గగనం
వింతలు విశేషాల మర్మములు విప్పేందుకు…
అక్షరాలకు పరిమళం అందించాలని
గ్రంధపు పుటలు తిరగేస్తూ ఉన్నాను
మకరందపు కవిత్వపు రుచి చూసి
మనో ఫలకం మీద రాసుకుంటున్నా..
కొప్పుల ప్రసాద్
 నంద్యాల
9885066235