నిషేధిత గుడుంబా స్వాధీనం,కేసు నమోదు

ఖానాపూర్ నియోజక వర్గ ప్రతినిధి ఆగస్ట్23(జనం సాక్షి): నిషేధిత గుడుంబా తయారు చేసిన అమ్మిన కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సీఐ సంపత్ కృష్ణ అన్నారు. మంగళవారం  ఆదిలాబాద్ జిల్లా డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ నరసింహారెడ్డి ఆదేశాల మేరకు ఖానాపూర్ మండలంలోని పలు గ్రామాలలో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం పాత ఎల్లాపూర్ గ్రామానికి చెందిన మాసాని రాజేశ్వర్ ఇంటి ముందు అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఐదు లీటర్ల గుడుంబా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నమని,అతను పరారీలో ఉన్నాడని అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని త్వరలో అతన్ని పట్టుకొని తహసిల్దార్ ముందు బైండోవర్ చేయనున్నట్లు తెలిపారు . అనంతరం గోసంపల్లి గ్రామంలో అనుమానాస్పద స్థలాల్లో తనిఖీలు చేస్తుండగా ఒక పాత ఇంటి ముందు ఖాళీ ప్రదేశంలో నిషేధిత గుడుంబా తయారీకి సిద్ధంగా ఉన్న భూమిలో పాతిపెట్టిన మూడు ప్లాస్టిక్ డ్రమ్ములలో సుమారు 300 లీటర్ల బెల్లం పానకాన్ని కనుగొని ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో ఎక్సైజ్ ఎస్సై రాయబారపు రవికుమార్ ,సిబ్బంది ముత్యం, నరేందర్, రషీద్ ,వెంకటేష్, నిరోషా పాల్గొన్నారు.