నీటిగుంతలో ఇద్దరి మృతదేహాలు గుర్తింపు
నిజామాబాద్,ఆగస్ట్10(జనంసాక్షి): జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బోధన్ పట్టణ శివారులోని బెల్లాల్ చెరువు అలుగు పక్కన ఉన్న నీటి గుంతలో రెండు మృతదేహాలు లభ్యమవడం స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో ఏసీపీ రామారావు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను రాకాసిపేట్ వాసులుగా గుర్తించారు. మృతదేహాలను బయటకు తీయించి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కాగా, మృతులు ఇరువురు సోదరులు అని పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాలతో పెదనాన్న కుమారుడే హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.