‘నీట్’ కు ఈ ఏడాది వెసులుబాటు
ఆర్డినెన్స్‌తో సుప్రీం ఆదేశాలను నిలుపు చేసిన కేంద్ర కేబినేట్
ఎంసెట్ ద్వారానే వైద్య సీట్ల భర్తీకి మార్గం సుగమం
కేంద్ర నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్లో ఆనందం
న్యూఢిల్లీ,మే20(జనంసాక్షి): నీట్‌ను ఈ యేడాదికి దూరంగా పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర కేబినేట్ నిర్ణయం తీసుకుని ఆర్డినెన్స్ జారీచేసింది. దీంతో సు ప్రీం ఆదేశాలను ఏడాదిపాటు నిలుపుచేయాలని కేంద్రం నిర్ణ యించింది. దీంతో ఆందోళనలో ఉన్న తెలుగు రాష్ట్రాల విద్యా ర్థులకు ఊరట లభించింది. అందుకోసం ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసింది. శుక్రవారం ఉదయం ప్రధాని
మోఒడీ అధ్యక్షతన భేటీ అయిన కేబినేట్ నీట్‌పై చర్చించింది. వివిధ రాష్ట్రాల అభ్యర్థనల మేరకు ఈ యేడాది దీనిని కొనసాగించకపోవడమే మంచిదని భావించి, ఆ మేరకు ఆర్డినెన్స్ జారీకి నిర్ణయించింది. దీంతో మెడికల్, డెంటల్ సీట్లకు ఆయా రాష్ట్రాల పరిధిలోనే అడ్మిషన్లు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ, ప్రైవేట్ మేనెజ్ మెంట్ సీట్లకు మాత్రం నీట్ ద్వారానే అడ్మిషన్లు జరగనున్నాయి. వివిధ రాష్ట్రాల మంత్రులతో ఇటీవల కేంద్ర మంత్రి జెపి నడ్డా నిర్వహించిన సమావేవంలో వచ్చిన అభిప్రాయం మేరకు,రాష్ట్రాల అభ్యంతరాల మేరకే ఆర్డినెన్స్ జారీ చేశామని కేంద్రం ఈ సందర్భంగా తెలిపింది. ఇప్పటికే మే 1న తొలి విడత నీట్ పరీక్షను ఆరు లక్షలమంది విద్యార్థులు రాశారు. జైలై 24న రెండో విడత నీట్ జరగాల్సి ఉండగా అంతకుముందే ఆర్డినెన్స్ వచ్చాయి. మెడికల్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రాయాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మే 9న నీట్ కంపల్సరీ అంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పింది. దీంతో నీట్ ప్రతిపాదనల కారణంగా విద్యార్థుల్లో తీవ్ర గందరగోళం ఏర్పడింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో పలు రాష్ట్రాల్లో నిర్వహించే ఎంసెట్ పరీక్షలకు విలువ లేకుండా పోయింది. దీంతో
మెడికల్, బీడీఎస్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులంతా నీట్ రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ఈ పరీక్షకు ఇప్పటికీ ఏ రాష్ట్రాల విద్యార్థులు కూడా సమాయత్తం కాలేదు. దీంతో ఈ విషయం ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఇదే అంశంపై ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో భేటీ అయిన కేంద్ర మంత్రి వర్గం ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని నీట్ వాయిదా వేయాలని నిర్ణయం తీసుకొని ఆర్డినెన్స్ జారీ చేశాయి. దాదాపు 14 రాష్ట్రాలు నీట్ వద్దని కోరుతూ కేంద్రానికి విజ్ఞప్తి చేసుకున్నట్లు ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఈ నిర్ణయం కోసం వేర్వేరు పార్టీలను కూడా సంప్రదించామని చెప్పారు. ఈ ఉత్తర్వులతో ఇప్పటికే ఎంసెట్ మెడికల్ పరీక్షలు నిర్వహించినవారైతే ఫలితాలు విడుదల చేసుకునేందుకు.. పరీక్ష నిర్వహించని వారు పరీక్ష నిర్వహణకు అవకాశం లభించినట్లయింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ పరీక్ష పూర్తయి ఫలితాలకోసం చూస్తున్నారు. మొత్తానికి కేంద్రం నిర్ణయం పలు రాష్ట్రాల విద్యార్థులకు కొంత ఊరటను కల్పించిందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవిం’ కేజీవ్రాల్.. నీట్ పరీక్షపై ప్రధాని మోదీకి ఓ లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను తూచ తప్పకుండా పాటించాల్సిందేనని ఆయన లేఖలో పేర్కొన్నారు.
నీట్ నిర్ణయంపై మంత్రుల హర్షం
నీట్‌ను ఏడాది పాటు వేయిదా వేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఏపీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ… తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఇది ఎంతో ఉపశమనం కలిగించే అంశమన్నారు. కేంద్ర ప్రభుత్వం, వెంకయ్యనాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నీట్‌ను వాయిదా వేయించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశామని మంత్రి కామినేని శ్రీనివాసరావు తెలిపారు. నీట్ అవసరం కానీ.. ప్రస్తుతం సిద్ధంగా లేమని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు తెలిపామని చెప్పారు. నీట్ నిర్వహణను ఏడాది పాటు వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్సు ఇవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులలో ప్రవేశానికి సంబంధించి త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆర్డినెన్సు చూసిన తర్వాత ఈ అంశంపై చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటికే ఆంధ్రప్రదేaలో వైద్య కోర్సులకు కూడా ఎంసెట్ నిర్వహించారు. ఫలితాలు, ర్యాంకులను మాత్రం విడుదల చేయాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వ పెద్దలు, అధికారులతో చర్చించి శనివారం ఉదయం 11- 12 గంటల మధ్యలో కీలక నిర్ణయం వెల్లడిస్తామని మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వ కాలేజీలలో ఉన్నట్లుగానే ప్రైవేటు వైద్య కళాశాలల్లో కూడా కన్వీనం కోటా ప్రవేశాలను ఎంసెట్ ద్వారా పూర్తిచేయాలని తాము కేంద్రాన్ని కోరినట్లు ఆయన చెప్పారు. ఈ అంశంపై ఆర్డినెన్సులో కేంద్రం ఏం చెప్పిందో చూసి.. అప్పుడు నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు. ఆ వివరాలు చూసిన తర్వాత అడ్మిషన్ల పక్రియను ప్రారంభిస్తామన్నారు. ఇక వచ్చే సంవత్సరం నీట్ పరీక్షకు హాజరయ్యేందుకు వీలుగా యుద్ధప్రాతిపదికన విద్యార్థులను సిద్ధం చేస్తామని ఆయన చెప్పారు. సీఎం సమక్షంలో విద్యాశాఖతో చర్చించి ప్రైవేటు, ప్రభుత్వ కళాశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్ ఎలా తేవాలో నిర్ణయిస్తామన్నారు. వాస్తవానికి నాలుగేళ్ల క్రితమే నీట్‌కు తాము సిద్ధమవుతామంటూ రాష్ట్ర ప్రభుత్వం అండంటేకింస్త్ర ఇచ్చిందని, ఆ విషయం కూడా తమకు తెలియదని అన్నారు. ప్రధానమంత్రి మోదీ, కేంద్ర మంత్రులు జె.పి.నడ్డా, వెంకయ్యనాయుడుల ప్రత్యేక చొరవ వల్లే నీట్‌పై ఆర్డినెన్స్ జారీ అయ్యిందని, సీఎం చంద్రబాబు ఈ అంశంపై మూడుసార్లు కీలక సమావేశాలు నిర్వహించి కేంద్రానికి ఏపీ అభ్యర్ధనను తెలియజేశారని చెప్పారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, తమ ప్రార్థనను కేంద్ర ఆలకించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక తెలంగాణలో నీట్‌పై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాతే ఎంసెట్ నిర్వహించడం, అందులో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు పరీక్ష నిర్వహించకపోవడంతో.. ఇప్పుడు మళ్లీ కొత్తగా పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. ఈ విషయంపై కూడా ఆర్డినెన్సు చూసిన తర్వాత ప్రభుత్వ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. కేంద్రం ఎంతవరకు వెసులుబాటు ఇచ్చిందో పరిశీలించిన తర్వాత తదుపరి విషయాలపై నిర్ణయిస్తామన్నారు.
నీట్ వాయిదాపై ఏపీ మంత్రుల హర్షం
హైదరాబాద్: నీట్‌ను ఏడాది పాటు వేయిదా వేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఏపీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ… తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఇది ఎంతో ఉపశమనం కలిగించే అంశమన్నారు. కేంద్ర ప్రభుత్వం, వెంకయ్యనాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నీట్‌ను వాయిదా వేయించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశామని మంత్రి కామినేని శ్రీనివాసరావు తెలిపారు. నీట్ అవసరం కానీ.. ప్రస్తుతం సిద్ధంగా లేమని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు తెలిపామని చెప్పారు.