నీట్ అర్హత పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

 

 

 

 

కరీంనగర్ బ్యూరో (జనం సాక్షి) :

ఎంబిబిఎస్,బిడియస్, ఆయూష్ వైద్య విద్యలో ప్రవేశానికి జాతీయ స్థాయిలో ఆదివారం నిర్వహించనున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారిచే సిటీ కోఆర్డినేటర్ గా నియమితులైన డాక్టర్ టి.లలిత కుమారి వ్యవహారిస్తుండగా జిల్లా పాలనా యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని నగర ఇంచార్జీ గా వ్యవహరిస్తున్న వివేకానంద రెసిడెన్షియల్ పాఠశాల( సి బి యస్ సి) అకడమిక్ డైరెక్టర్ డాక్టర్.శ్రీమతి టి.లలితకుమారి గారు తెలియజేశారు.
6 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 3775 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అవుతుండగా ఎన్ టి ఏ వారిచే నియమితులైన అబ్జర్వర్లు సిటి కోఆర్డినేటర్ పర్యవేక్షణలో పరీక్ష కేంద్రాలను పర్యవేక్షిస్తారు.కరీంనగర్ లోని జగిత్యాల రోడ్డు లో గల వివేకానంద రెసిడెన్షియల్ పాఠశాల( సి.బి.యస్.ఇ). వివేకానంద డిగ్రీ &పీజీ కళాశాల.నుస్తుల్లాపూర్ లోని జ్యోతిష్మతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్, హుజూరాబాద్ లోని కమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల, జగిత్యాల లోని శ్రీచైతన్య హైస్కూల్,కే.జీ ఆర్ పబ్లిక్ స్కూల్ .పరీక్ష కేంద్రాలు గా ఉన్నట్లు నగర కోఆర్డినేటర్ డాక్టర్.శ్రీమతి టి.లలిత కుమారీ తెలిపారు.
నీట్ పరీక్ష ఆదివారం మధ్యాహ్నం 2గంటల నుండి 5:20గంటలవరకు నిర్వహించబడుతుందని కోవిడ్ 19 పరిస్థితుల దృష్ట్యా
విద్యార్థులు వారి అడ్మిట్ కార్డుల పై నిర్దేశించబడిన సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని మొదటి బ్యాచ్ ఉదయం 11గంటలకు ప్రారంభం అవుతుందని విద్యార్థులందరూ కోవిడ్ నిబంధనలు తప్పని సరిగా పాటించాలని కోరారు.పరీక్ష ప్రారంభ సమయానికి 1నిమిషం ఆలస్యం అయినా విద్యార్థులకు అనుమతి లభించదు అని విద్యార్థులు తమ వెంట పాస్పోర్ట్ సైజ్ ఫోటో ను అతికించిన అడ్మిట్ కార్డు, మంచినీళ్ళ సీసా శానిటైజర్,మాస్కులను తప్పనిసరిగా తెచ్చుకోవాలని మొబైల్,ఏ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా కేంద్రాల్లో కి అనుమతించబోమని, విద్యార్థులు ఇందుకు సహకరించాలని కోరారు.