నీట మునిగిన శ్మశాన వాటిక, సెగ్రిగేషన్ షెడ్
ప్రారంభం కాకముందే కూలిన దుస్థితి
మానేరులో నిర్మాణం చేపట్టడం పై ప్రజల ఆగ్రహం

అన్ని గ్రామాల్లో శ్మశాన వాటికలు నిర్మించాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైకుంఠ దామాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టి ఒక్కో వైకుంఠ దామానికి పది లక్షల వెచ్చించి నిర్మించిన శ్మశాన వాటికలు తాడిచర్ల తో పాటు పలు గ్రామాల్లో ఇప్పటి వరకు కనీసం వాడుకలోకి తీసుకురావాలనే ఆలోచన కూడా అధికార యంత్రాంగం చేయక పోవడం గమనార్హం. తాడిచర్ల శ్మశాన వాటికను పూర్తిగా మానేరులో నిర్మాణం చేపట్టడం వల్ల స్థానిక ప్రజలు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ఊరుకి దూరంగా కట్టడమే కాకుండా పూర్తిగా మానేరులో ప్రవాహంలో నిర్మాణం చేయడం ఏంటని ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ప్రజల అవసరం కోసం కాకుండా కేవలం గుత్తేదారుల జేబులు నింపేందుకు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారని ప్రజల అవసరాన్ని మాత్రం పక్కన పెట్టి కమీషన్లు తీసుకుని చేతులు దులుపుకున్నారని ఆరోపిస్తున్నారు. గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు సెగ్రిగేషన్ షెడ్ మానేరు ఉదృతిలో కొట్టుకు పోయిన విషయం తెలిసిందే. కాగా ఐదు రోజుల పాటు కురుస్తున్న భారీ వర్షాలకు మానేరు నది పొంగి ప్రవహిస్తోంది దీంతో శ్మశాన వాటిక మొత్తం నీటిలో మునిగి పోయిన దుస్థితి దాపురించింది. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోకుండా ఎక్కడో దూరంగా నిర్మాణం చేసిన అది కూడా పూర్తిగా మానేరు నదిలో కట్టి లక్షల రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిన అధికారుల పై ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో వారికే తెలియాలి. ప్రారంభం కాకుండానే మానేరులో కొట్టుకు పోయిన సెగ్రిగేషన్ షెడ్ నిర్మాణం నిధులు రాజుల సొమ్ము నీళ్ల పాలుగా తయారైంది తాడిచర్ల శ్మశాన వాటిక పరిస్థితి. మండల కేంద్రమైన తాడిచర్ల మేజర్ గ్రామ పంచాయతీ శ్మశాన వాటిక ఇతర గ్రామాలకు ఆదర్శంగా ఉండే విధంగా నిర్మాణం చెపట్ఠవల్సి ఉండేది. కానీ అధికారుల తప్పుడు నిర్ణయాలతో స్మశాన వాటిక ప్రజలకు అందుబాటులోకి రాకుండా కేవలం గుత్తేదారుల జేబులు నింపేందుకే తూ తూ మంత్రంగా నిర్మాణం చేసి కాగితాలకే పరిమితం చేశారని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇతర ప్రాంతంలో శ్మశాన వాటిక నిర్మాణం చేసేందుకు చర్యలు తీసుకోవాలని మండల కేంద్రంలోని మేజర్ పంచాయతీ ప్రజలు వేడుకుంటున్నారు.