నీళ్లు, నిధులు, నియామకాల ఊసే ఎత్తని టీఆర్ఎస్ సర్కారు
ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ పునరుద్దరణలో విఫలం
యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీధర్
బోధన్, ఆగస్టు 18 ( జనంసాక్షి ) : తెలంగాణ సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే నీళ్లు, నిధులు, నియామకాలపై దృష్టి సారిస్తామని చెప్పి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత ధనార్జనే ద్యేయంగా పాలన సాగుతోందని యూత్ కాంగ్రెస్ బోధన్ నియోజకవర్గ అధ్యక్షుడు వడ్డాపల్లి శ్రీధర్ స్పష్టం చేశారు. శుక్రవారం బోధన్ మండలం పెగడపల్లి గ్రామంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ సమావేశాన్ని యూత్ కాంగ్రెస్ బోధన్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డాపల్లి శ్రీధర్ మాట్లాడుతూ, ఆసియాలోనే పేరుగాంచిన బోధన్ చక్కెర ఫ్యాక్టరీని మూత పడేసిన ఘనత టీఆర్ఎస్ సర్కారుకు దక్కుతుందన్నారు. బోధన్ చక్కెర ఫ్యాక్టరీ విషయంలో ఎంపీ, ఎమ్మెల్యేలు పూర్తిగా విఫలమైనారని ఆయన ఆరోపించారు. ఫ్యాక్టరీనీ అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని, కార్మికులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ కవితలు స్పష్టం చేసినప్పటికీ లాభం లేకుండా పోయిందని ఆయన ఆరోపించారు. ప్రజలను, రైతులను మోసగిస్తున్న టీఆర్ఎస్ సర్కారుకు రానున్న ఎన్నికల్లో గట్టి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అయితే సర్కారు వ్యతిరేకతను ప్రజలకు వివరించడంలో యూత్ కాంగ్రెస్ నాయకులు ముందుండాలని ఆయన అన్నారు. గ్రామగ్రామాన ప్రభుత్వ వైఫల్యంను ప్రజలకు వివరించాలని ఆయన అన్నారు. కాగా ఈనెల 20వ తేదీన రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను యూత్ కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించాలని వడ్డాపల్లి శ్రీధర్ కోరారు. ఈ సమావేశంలో యూత్ కాంగ్రెస్ బోధన్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అశోక్, కార్తీక్, లక్ష్మణ్, బోధన్ పట్టణ ఇంఛార్జి శ్రవణ్ కుమార్ రెడ్డి, ఎడపల్లి మండల యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు ఫరాన్, భాను, ఎంపీటీసీ