నుమాయిష్‌కు బారీ భద్రత జానారెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 29 (జనంసాక్షి): అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్)కు వచ్చే సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసే బాధ్యత ఎగ్జిబిషన్ సొసైటీదేనని అధ్యక్షుడు జానారెడ్డి తెలిపారు. శనివారం నాడు నూమాయిష్ ఏర్పాట్లపై ఆయన సమీక్ష జరిపారు. గతంతో పోలిస్తే ప్రజాభద్రతపై ఈ సారి ఎక్కువ దృష్టి కేంద్రీకరించినట్లు ఆయన తెలిపారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలు, ఇతర అదరపు ఖర్చుల వల్ల ప్రవేశ రుసుం ధర పెంపు అనివార్యమైందని ఆయన వివరణ ఇచ్చారు ప్రదర్శనలో వసతుల కల్పన, ఆధునీకీకరణకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మానం కోసం అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. జనవరి 1 నుంచి ప్రదర్శన ప్రారంభమవుతుదని ఆయన వెల్లడించారు. గతేడాది ప్రదర్శన ద్వారా 15కోట్ల రూపాయలు సమీకరించినట్లు జానారెడ్డి చెప్పారు. ఆ డబ్బును ప్రజాసేవకు, కమిటీ అనుబంధ విద్యాసంస్థల వృద్ధికి ఖర్చు చేసినట్లు తెలిపారు. కాగా తెలంగాణపై సానుకూల ప్రకటన వెలువడుతుందని ఆశిస్తున్నట్టు మంత్రి జానారెడ్డి అన్నారు. తెలంగాణపై నెలలోగా నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే చేసిన ప్రకటనను కెసిఆర్ నమ్మలేదని అందుకే బంద్‌కు పిలుపునిచ్చారని ఆయన అన్నారు.