నులిపురుగుల నివారణ పై అవగాహన సదస్సు నిర్వహించిన డాక్టర్ మౌనిక
కోడేరు (జనం సాక్షి) సెప్టెంబర్ 13 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో సెప్టెంబర్ 15న జరిగే నులిపురుగుల నివారన దినోత్సవం సందర్భంగా మండల వైద్యశాఖ అధికారి శ్రీమతి మౌనిక. నూలి పురుగుల నివారణ దినోత్సవ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలో మరియు మోడల్ స్కూల్ కేజీబీవీ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు నులిపురుగుల నిర్వహణ దినోత్సవం సందర్భంగా ప్రధానోపాధ్యాయులకు ఒక్కరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం లో డాక్టర్ శ్రీమతి మౌనిక మేడం, మాట్లాడుతూ ఒకటి నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలకు సెప్టెంబర్ 15వ తేదీన ఆల్బెండజోల్ టాబ్లెట్లు ప్రతి పిల్లవానికి వేయించాలని పిల్లలకు నులిపురుగుల వలన కడుపునొప్పి ఆకలి కాకపోవడం వీక్ గా ఉండడం పిల్లల్లో సాధారణంగా ఉండే లక్షణాలు అని తెలిపారు. పై మూడు రకాలు ఉన్న పిల్లలకి కచ్చితంగా సెప్టెంబర్ 15వ తేదీన ఉదయం భోజనం తర్వాతనే ఆల్బెండోజోల్ టాబ్లెట్లు వేయాలని ప్రధానోపాధ్యాయులకు శ్రీమతి మౌనిక డాక్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.