నువ్వూ.. నేను దోస్త్..!!
రాజయ్య, కడియం శ్రీహరి ఒక్కటయ్యారు
అసెంబ్లీ ఎన్నికల ముంగిట బీఆర్‌ఎస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మొన్నటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్న మాజీ మంత్రి కడియం శ్రీహరి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఒక్కటయ్యారు. ఈ మేరకు ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒకరికొకరు చేతులు కలిపారు. రాజయ్యకు సముచితం స్థానం కల్పిస్తామని కేటీఆర్ హామీనివ్వగా… బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపు కోసం తన సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు రాజయ్య పేర్కొన్నారు. ఇందుకు కడియం శ్రీహరి కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఇన్నాళ్లు స్టేషన్ ఘన్‌పూర్‌లో చోటుచేసుకున్న పరిణామాలతో ఎట్టకేలకు కొలిక్కి వచ్చినట్టయ్యింది.