నూతనంగా నిర్మించే గ్రామపంచాయతీ భవనానికి భూమి పూజ- ఎక్కేటి రఘుపాల్ రెడ్డి

వీణవంక మండలంలోని వల్బాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించే గ్రామపంచాయతీ భవనానికి భూమి పూజ నిర్వహించారు ఈ నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణం కు సుమారుగా 20 లక్షల రూపాయలు ప్రభుత్వ కేటాయించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ ఎక్కేటి రఘుపాల్ రెడ్డి నూతనంగా నిర్మించే గ్రామ పంచాయతీ భవనముకు భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతుందని కొత్తగా వల్భ పూర్ గ్రామపంచాయతీ నిర్మాణం కొరకు సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు
ఈ కార్యక్రమంలో A.E. రాంబాబు . కామిడీ శ్రీనివాస్ రెడ్డి పోరెడ్డి తిరుపతిరెడ్డి .నలుబాల బిక్షపతి .తాళ్లపల్లి ఐలయ్య మారముల కిరణ్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.