నూతన పార్లమెంట్ భవనానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలి ఎమ్మార్పీఎస్టిఎస్ జిల్లా అధ్యక్షులు ముదిగొండ ఎల్లేష్ మాదిగ

చందంపేట (జనం సాక్షి)అక్టోబర్ 21
 మండలం పోలేపల్లి ఎక్స్ రోడ్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తెలంగాణ రాష్ట్రం చందంపేట మండల కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం అందుగుల సైదులు  ఆధ్వర్యంలో నిర్వహించడం
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ముదిగొండ ఎల్లేష్ మాదిగ  మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో నిర్మిస్తున్నటువంటి నూతన పార్లమెంట్ భవనానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారుచేశారు
భారతదేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టకుండా
భారతీయ జనతా పార్టీకి దళితుల మీద ఏమాత్రం ప్రేమ ఉన్న చిత్తశుద్ధి ఉన్న దేశంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి 20 లక్షల దళిత బంద్ ఇవ్వాలని డిమాండ్ చేశారు మాదిగల చిరకాల ఆకాంక్ష ఏబిసిడి వర్గీకరణ అంశాన్ని తుంగలోదొక్కి మునుగోడులో ఏం ఉద్ధరించడానికి ఎన్నికలకు వచ్చారో
 చెప్పాలని ఆయన అన్నారు పార్లమెంట్ భవనానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టాలని అదేవిధంగా దేశంలో ప్రతి దళిత కుటుంబానికి 20 లక్షల దళిత బంధం ఇవ్వాలని చెప్పి మునుగోడులో బిజెపి పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తాం అని తెలియజేశారు
ఈ సమావేశంలో మండల అధ్యక్షులు అందుగుల సైదులు  నేరేడుగోమ్ము మండల అధ్యక్షులు  మల్లయ్య నాగిల్ల అంజయ్య అంకుర్ సురేష్ అంజి క్రాంతికుమార్ సాయి తదితరులు పాల్గొన్నారు
Attachments area