నూతన పెన్షన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ,ఎమ్మెల్యే*
పెద్దేముల్ సెప్టెంబర్ 02 (జనం సాక్షి)
పెద్దేముల్ మండలంలోని కందనెల్లి జి పి ఆర్ గార్డెన్ లో శుక్రవారం నాడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ల చేతుల మీదుగా నూతన పెన్షన్ కార్డులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఒక్కరి ఇంట్లో పెద్దన్న పోషిస్తున్నారని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ, ప్రజలకు ఆమోదయోగ్యమైన ప్రభుత్వ పథకాలను ప్రవేశపెడుతూ ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకం దరిచేరే విధంగా ప్రోత్సహిస్తున్నారని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలలో రాష్ట్రం చుట్టూ ఉన్న బిజెపి పాలిత ప్రాంతాల రైతులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను చూసి ఆ పథకాలు కూడా మా రాష్ట్రంలో అమలు చేసే విధంగా చూడాలని బిజెపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు.గత మూడు సంవత్సరాల నుండి ఆసరా పెన్షన్లు ఇవ్వకపోవడం వల్ల కొంత ఇబ్బంది జరిగినా మాట వాస్తవమేనని,కాని రెండు సంవత్సరాలు కరోనా మహమ్మారి,తొలి సంవత్సరం ఎన్నికల వలన దీంతో అభివృద్ధికి కొంత ఆటంకం కలిగింది.ఇప్పుడు ప్రభుత్వ పథకాల అన్నింటితోపాటు తాండూర్ అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ రాని వారందరికీ కొత్త దరఖాస్తులు తీసుకొని అందరికీ పెన్షన్ వచ్చే విధంగా ప్రభుత్వ అధికారులు చూస్తారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మంచి ప్రోత్సాహకాలు అందిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వాల కంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నూటికి నూరుపాలు వ్యవసాయం లాభసాటి అనే విధంగా ప్రోత్సాహకాలు ఇచ్చి రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చిందని తెలిపారు. రైతుల కోసమే రైతు రైతు బీమా,రైతు బంధు,దళిత బంధు,షాదీ ముబారక్,కళ్యాణ లక్ష్మి, వికలాంగుల పెన్షన్లు,వృద్ధాప్య పెన్షన్లు,వితంతు పెన్షన్లు కేసీఆర్ కిట్లు తదితర పథకాలతో రైతు ఎల్లవేళలా ఆనందంగా ఉండాలని ఉద్దేశంతో ఈ పథకాలాన్ని ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఎ పిడి కృష్ణన్,ఎంపీపీ అనురాధ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్, జెడ్పిటిసి ధారాసింగ్ నాయక్, ఎఫ్ఎసిఎస్ చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి, వైస్ ఎంపిపి మధులత, కోట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పరి మహేందర్, రాష్ట్ర ఎంపిటిసిల ఫోరం అధ్యక్షుడు వెంకటేష్ చారి,మండల ఎంపీటీసీలో ఫోరమ్ అధ్యక్షుడు ధన్ సింగ్, ఎంపిడిఓ లక్ష్మప్ప,ఎంపిఒ షేక్ సుష్మ, ఆర్ఐ రాజి రెడ్డి, సర్పంచులు ద్యావరి విజయమ్మ,మోహన్ రెడ్డి, భరత్ కుమార్,పద్మమ్మ, హైదర్,చంద్రయ్య,శ్రవణ్ కుమార్,వీరప్ప,నర్సింలు, రాములు,తులసి రమేష్, పాషా,గోవర్ధన్,టిఆర్ఎస్ నాయకులు మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, కొమ్ము గోపాల్ రెడ్డి,ఎస్ నారాయణరెడ్డి, రమేష్ యాదవ్,విజయకుమార్, జ్ఞానేశ్వర్, మైపాల్ రెడ్డి, జయరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.