నూతన పెన్షన్ లబ్ధిదారులకు ప్రొసిడింగ్ అందజేత
ఇబ్రహీంపట్నం , సెప్టెంబర్ 09 ,(జనం సాక్షి ) జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన నూతన పెన్షన్ లబ్ధిదారులకు కోరుట్ల కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రొసిడింగ్స్ పత్రాలను అందజేశారు.ఈ మేరకు శుక్రవారం నాడు ఇబ్రహీంపట్నం , వర్షకొండ , వేములకుర్తి క్లస్టర్లలో పర్యటించిన ఎమ్మెల్యే విద్యాసాగర్రావు నూతనంగా 979 మంది పెన్షన్ దారులకు ప్రొసిడింగ్ పత్రాలను అందించారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుండి 63 మందికి సంబందించిన 23 లక్షల విలువ గల చెక్కులను లబ్ధిదారులకు అందించారు. పేదింటి ఆడబిడ్డలకు వివాహ కానుకగా ఇచ్చే కల్యాణలక్ష్మి చెక్కులను 12 మందికి 12 లక్షల 01 వేయి 392 విలువ గల చుక్కలను అందించారు. రైతు బంధు పధకం క్రింద మంజూరైన రూ 5 లక్షల చెక్కును మొత్తానికి అందించారు.అలాగే సీడిఫ్ కింద ఎమ్మెల్యే నిధుల నుండి డబ్బా గ్రామానికి చెందిన సేవాలాల్ సంఘానికి , బుడగ జంగాలు సంఘా భవన నిర్మాణానికి ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున 4 రూ చెక్కును అందించారు. యామాపూర్ శివాలయం అభివృద్ధికి 4.50 లక్షలు ,పూసల సంఘా అభివృద్ధికి 1 లక్ష రూ చెక్కును అందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్త పింఛన్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అత్యధిక పింఛన్లు ఉన్న ఘనత కోరుట్ల నియోజకవర్గానికి దక్కుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ జాజాల భీమేశ్వరి , జెడ్పిటిసి కంఠం భారతి , సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు నేమూరి లత సత్యనారాయణ , అన్ని గ్రామాల సర్పంచ్లు ,ఎంపీటీసీలు ,కోఆప్షన్ సభ్యులు ,పిఎసిఎస్ చెర్మైన్లు , రైతు సమన్వయ సమితి అధ్యక్షులు , అధికారులు , టీఆర్ఎస్ నాయకులు , ప్రజలు తదితరులు పాల్గొన్నారు.