నూతన పెన్షన్ విధానం పై కేంద్రంపై డిమాండ్: రాష్ట్ర ఉపాధ్యక్షుడునూతన పెన్షన్ విధానం పై కేంద్రంపై డిమాండ్: రాష్ట్ర ఉపాధ్యక్షుడు

 

 

 

 

 

 

 

 

 

పాత పింఛన్ విధానంపై 84 లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాలను కించపరిచే విధంగా కేంద్రం వైఖరి
లోక్ సభలో కేంద్రమంత్రి ప్రకటనపై TSCPSEU రాష్ట్ర ఉపాధ్యక్షుడు మ్యాన పవన్ కుమార్.
ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మ్యాన పవన్ కుమార్, మంగళవారం పత్రిక ప్రకటన ద్వారా జనం సాక్షి మీడియాకు తెలుపుతూ, లోక్ సభలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో పాత పింఛన్ విధానంపై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని, సోమవారం కేంద్ర మంత్రి చెప్పిన సమాధానం ఊరంతా ఒక దారి అయితే ఉలిపికట్టేది మరో దారి అనే తరహాలో పాత పింఛన్ విధానం పై కేంద్రం వైఖరి ఉందని ఇది దేశంలోని 84 లక్షల సి పి ఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాలను కించపరిచే విధంగా ఉందని, తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కిం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మ్యాన పవన్ కుమార్, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ పాత పెన్షన్ విధానం రద్దుతో పాటు నూతన పెన్షన్ విధానం రద్దుపై అడిగిన ప్రశ్నలపై కేంద్ర మంత్రి ఉద్యోగుల, ఉపాధ్యా యుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్లో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడానికి భారత ప్రభుత్వం పరిశీలనలో ఎలాంటి ప్రతిపాదనలేదని, కేంద్రమంత్రి చెప్పడం దేశవ్యాప్తంగా ఉన్న 84 లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాలకు సామాజిక భద్రతపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియచేస్తుందని, అదేవిధంగా రాజస్థాన్, చత్తీస్ ఘడ్, జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదన లకు ప్రతిస్పందనగా పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం 2013 కింద ఉపసంహరణ నిబంధనలు లేవని, నిబంధనలను 2015లో కూడా ఈ నిబంధనలో పొందుపరచలేదని వీటిని కాలానుగుణంగా సవరించినట్టు ఆయన తెలిపారు. ఉద్యోగుల కుటుంబాల సామాజిక భద్రత పట్ల కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ఇప్పటికే  రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ జార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాలు తమ రాష్ట్ర ప్రభు ఉద్యోగుల నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసుకుంటున్నాయని,హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కేవలం 0.9 శాతం ఓట్లతోనే ఫలితాలు తారుమారయ్యాయన్న విషయాన్ని అధికారంలో ఉన్న పార్టీలు గుర్తుంచుకోవాలని హితవు పలుకుతున్నామని, పాత పింఛన్ విధానం పట్ల పార్టీల వైఖరి ఆధారం గానే హిమాచల్ ఫలితాలు వచ్చాయన్నది వాస్తవమన్నారు. నూతన పింఛన్ విధానం కేవలం ఉద్యోగుల కడుపుకొట్టి కార్పొరేట్ల కడుపునింపేలా ఉందన్న వాస్తవాన్ని గ్రహించి, దేశంలోని అన్ని రాష్ట్రాలు పాత పింఛన్ విధానాన్ని వర్తింపజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గంగాధరి మహేష్,ప్రధాన కార్యదర్శి సర్వ సతీశ్,కోశాధికారి గొల్లపల్లి మహేష్ మరియు వీరబత్తిని శ్రీనివాస్,బండారి సతీష్,సందుబట్ల రమేష్,బోగ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు