నూలిపురుగుల నివారణకు నట్టల నివారణ మాత్ర తప్పనిసరి.
జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం.వెంకట్ దాస్.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్15(జనంసాక్షి):
జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా గురువారం నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల పరిధిలోని మంగనూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నూలిపురుగుల నివారణ కొరకు ఆల్బెండజోల్ మాత్రను వేసే కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య ఉపశాఖ అధికారి డాక్టర్ ఎం వెంకట్ దాస్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉండుటకు, మానసిక, శారీరక, శరీరంలో పోషక విలువలు పెరుగుదలకు, నట్టల నివారణకు ఆల్బెండజోల్ మాత్ర ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం ద్వారా రెండు విడుతలలో ఒక సంవత్సరం నుండి 19 సంవత్సరాల వయసు ఉన్న అందరికీ ,వైద్య ఆరోగ్య సిబ్బంది ద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, జూనియర్ కళాశాలలో, కిషోర బాల,బాలికలకు మరియు బడిబైట ఉన్న పిల్లలందరికీ ఈ కార్యక్రమంలో నియమిత ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తల ద్వారా నూలిపురుగుల నివారణ మాత్రలు ఉచితంగా అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంద్వారా పిల్లలలో వికాసం పెరుగుదల తో పాటు, పాఠశాల హాజరు శాతం కూడా పెరుగుతుందని అన్నారు. నేడు మాత్ర వేసుకొని పిల్లల అందరికోసం ఈనెల 22న గురువారం రోజు మాపప్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పబ్లిక్ హెల్త్ నర్స్ పి. ప్రమీల, మంగనూర్ గ్రామ సర్పంచ్ కొత్తకోట రంగమ్మ, మండల ప్రాదేశిక సభ్యులు వేముల తిరుపతయ్య, లట్టుపల్లి ఆరోగ్య సూపర్వైజర్ కే.కిస్టమ్మ, ఆరోగ్య సిబ్బంది టీ. యాదగిరి,అబ్దుల్ సలీం, పి. పద్మ,, పి. జ్యోతి, ఆశా కార్యకర్తలు శారద, కృష్ణవేణి, బాలమని, ఉపాధ్యాయులు వరలక్ష్మి, కళ్యాణి, సల్మా బేగం, పరశురాములు, సరస్వతి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.