నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడి గా యడ్ల
నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖానాపురం మండల కేంద్రానికి చెందిన మాజీ జెడ్పిటిసి యడ్ల జగన్మోహన్ రెడ్డి ని నియమిస్తూ నర్సంపేట మాజీ శాసనసభ్యులు, ఏఐసీసీ సభ్యులు దొంతి మాధవ రెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా యడ్ల జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో రెండోసారి నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించిన ఏఐసీసీ సభ్యులు, నర్సంపేట మాజీ శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.