నెలాఖరులోగా మిషన్‌ కాకతీయ పనులు పూర్తి చేయండి

5

– మొదటి విడత పనుల పురోగతిలో వెనుకబడ్డ అధికారులపై మంత్రి హరీశ్‌ ఫైర్‌

హైదరాబాద్‌,మే14(జనంసాక్షి):మిషన్‌ కాకతీయ పనులు ఈ  నెలాఖరులో పూర్తి చేయాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావు అధికారులను ఆదేశించారు. మొదటి విడత  మిషన్‌ కాకతీయ పనుల్లో అలసత్యం వహించిన అధికారులపై ఆయన మండిపడ్డారు. శనివారం మంత్రి హరీశ్‌రావు మిషన్‌ కాకతీయ పనుల పురోగతిపై  జిల్లా వారీగా,  డివిజన్‌ ల వారిగా సవిూక్ష నిర్వహించినారు. ఈ సవిూక్ష లో మంత్రి తో పాటు ఇరిగేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జోషి, ఇ. యన్‌. సి లు మురళీధర్‌, విజయప్రకాశ్‌, యస్‌. పి. డి. మల్సుర్‌, సి.ఇ. లు నాగేందర్‌, సురేశ్‌, బంగారయ్య, మధుసూధన రావు, శంకర్‌ నాయక్‌, లింగరాజు, జే. యస్‌. శ్రీనివాస్‌, ఓ. యస్‌. డి. దేశ్‌ పాండే లు ఉన్నారు.రాష్ట్ర సగటుకు వెనుకబడిన (టెండర్లు, అగ్రిమెంట్లు, గ్రౌండింగ్‌ లలో ) జిల్లాల పై ప్రత్యేకంగా దృష్టి సారించినారు. (అవి రంగారెడ్డి, మహబూబ్‌ నగర్‌, వరంగల్‌, కరీంనగర్‌.) వెనుకబడిన జిల్లాలు త్వరిత గతిన పురోగతి సాధించాలని అన్నారు.వరంగల్‌ ఎస్‌ఈ ని పురోగతి లో తీవ్రంగా వెనుకబడినందున ఆగ్రహం వ్యక్తం చేస్తూ సెలవు పై వెళ్లాలని ఆదేశించినారు.. మంత్రి హరీష్‌ రావు వెంటనే కొత్త యస్‌. ఇ. ని నియమించాలని ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ని ఆదేశించినారు.మిషన్‌ కాకతీయ మొదటి దశ పనులను మే నెలాఖరు వరకు పూర్తి చేయాలని, మిషన్‌ కాకతీయ ఫలితాలను ప్రజలు అనుభవించి ఆనంధించేటట్లు చూడాలని అన్నారు.క్వాలిటీ కంట్రోల్‌ సర్టిఫికేట్‌ పొందిన తర్వాతనే ఫైనల్‌ బిల్స్‌ నమోదు చేయాలని ఆదేశించినారు.5 కంటే ఎక్కువ టెండర్లు పొందిన ఏజన్సీ లకు 5 పనులకే పరిమితం చేయాలని అన్నారు. మిగితా టెండర్లను ఎల్‌2 ని యల్‌ 1 రేట్లకే చేయడానికి సంప్రదించాలని ఆదేశించినారు. లేని పక్షం లో వెంటనే రెండవ టెండర్‌ కాల్‌ కి వెళ్లాలని కోరారు.్గ వచ్చే వీడియో కాన్ఫరెన్స్‌ కి మిషన్‌ కాకతీయ తో పాటు ఆర్‌ఆర్‌ఆర్‌, జైకా, నాబార్డ్‌, వరల్డ్‌ బ్యాంక్‌ పనుల పురోగతిని కూడా పెంచాలని ఆదేశించినారు. వీటి యుటిలైసషన్‌ సర్టిఫికెట్లను సమర్పించాలని ఆదేశించినారు.ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం 556 చెరువులను 100 ఎకరాల ఆయకట్టుకు తగ్గకుండా ఉన్న వాటిని ఎంపిక చేసి వెంటనే ఆఖఖీ లు తయారు చేయాలని అన్నారు.్గ వరంగల్‌ జిల్లాలోని నర్సంపేట నియోజక వర్గం లో 3 మండలాల్లో మిషన్‌ కాకతీయ పనులు ఒక్కటి కూడా మొదలు కాకపోవటం పట్ల మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ మూడు మండలాల్లో వచ్చే వీడియో కాన్ఫరెన్స్‌ నాటికి పురోగతి చూపించడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు.వర్షాలు ప్రారంభం అయ్యే నాటికి అన్నీ చెరువుల యొక్క తూములను మూసి ఉంచాలని, గేట్లు లేనివాటికి వెంటనే గేట్లు అమర్చాలని అన్నారు మంత్రి హరీష్‌ రావు.్గ టెండర్లు పొంది అగ్రిమెంటుకు రాని  ఏజన్సీ లను వెంటనే బ్లాక్‌ లిస్ట్‌ లో పెట్టి వెంటనే మళ్ళీ టెండర్లు పిలవాలని ఆదేశించినారు.్గ ఫీల్డ్‌ రిజిస్టర్లు కచ్చితంగా మెంటెన్‌ చేయాలని అన్నారు.్గ కొత్త ఇంజనీర్లకు ఎవరికి 5 సంవత్సరాల వరకు హైదరాబాద్‌ లో పోస్టింగ్‌ ఇవ్వరాదని అలాగే ప్రమోషన్‌ పొందిన ఇంజనీర్ల కు కూడా హైదరాబాద్‌ లో పోస్టింగ్‌ ఇవ్వరాదని మంత్రి ఆదేశించినారు. నలగొండ జిల్లా భీమలింగంపల్లి కెనాల్‌ కు సంబంధించిన అనుమతులు త్వరలోనే ప్రభుత్వం నుండి వెలువడనున్నందున ఆ పనులకు సంబంధించిన టెండర్లను పిలవాలని నలగొండ యస్‌. ఇ. ని ఆదేశించినారు.పాలేరు ఉప ఎన్నిక ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న పోటీ కాదని, రెండు పార్టీల మధ్య జరుగుతున్న పోరాటమని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అన్నారు. శనివారం ఖమ్మంలోని ఎస్‌ఆర్‌ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో మంత్రులు మహేందర్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, పాలేరు అభ్యర్థి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు