నేటితో E-కెవైసి గడువు అఖరు….
చిలప్ చేడ్/సెప్టెంబర్/జనంసాక్షి :- మండల పరిధిలోని అజ్జమర్రి గ్రామంలో బుధవారం నాడు పీఎం కిసాన్ ఈ కేవైసీ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన ఏడిఏ పద్మ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత కొన్ని రోజుల క్రితం పీఎం కిసాన్ ఈ కేవైసీ చేయించుకున్న రైతులకు పీఎం కిసాన్ రూ.2000 రూపాయలురైతు వారి ఖాతాలలో జమ కావడం జరిగింది అలాగే కొంతమంది రైతులు ఇంకా ఈ కేవైసీ చేయించుకోని రైతులు ఉన్నారు అటువంటి వారు ఈ కేవైసీ చేయించుకోకపోతే వారికి పీఎం స్కీం 2000 రూపాయలు గుర్తు చేశారు కావున వారు తప్పనిసరిగా ఈ కేవైసీను చేయించుకోవాలని గుర్తు చేశారు అనంతరం గ్రామంలోని పత్తి వరి పంటలను పరిశీలన చేయడం జరిగింది పత్తి పంట వర్షం ఎక్కువ కురవడం వలన పత్తి మొక్కల వేర్లకు ఆక్సిజన్ మొక్కలు వాడిపోవడం జరిగింది దీని నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు ప్లాంటోమైసిన్ 0.5గ్రామ్ లీటర్ నీటిలో కలిపి పిచికారి చేస్తే మొక్కలు మెరుగుపడతాయని రైతులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఏఈఓ భూపాల్ ఎంపిటిసి మల్లయ్య ఉపసర్పంచ్ పోచయ్య రైతులు పాల్గొన్నారు