నేటి నుంచి ఏబీవీపీ తెలంగాణ మహాపాదయాత్ర
నల్లగొండ : తెలంగాణ కోసం అఖిల భారత విద్యార్ధి పరిషత్ ( ఏబీవీపీ) ఆధ్వర్యంలో మహాపాదయాత్ర చేపట్టనున్నారు. సోమవారం కోదాడలో ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర తొమ్మిది రోజులపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల గుండా సాగనుంది. ఈ పాదయాత్ర తెలంగాణ సాధన కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల సారథ్యంలో చేపడుతున్నారు. కోదాడలో ఉదయం 10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటలకు చిలుకూరులో రోడ్‌షో నిర్వహిస్తారు. 27న హుజూర్‌నగర్, గరిడేపల్లి, నేరేడుచర్ల, 28న మిర్యాలగూడ, వేములపల్లి, 29న మాగుగులపల్లి, తిప్పర్తి, 30న నల్గోండ, చర్లపల్లిలో బహిరంగసభ నిర్వహిస్తారు.. అదేరోజు రాత్రి 7 గంటలకు మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో సదస్సు జరగనుంది. 1న నార్కట్‌పల్లి, చిట్యాల 2న వెల్మినేడు, గుండ్రాంపల్లి, 3న చౌటుప్పల్, కొయ్యలగూడెంలలో పాదయాత్ర నిర్వహిస్తారు. మరుసటి రోజు కొయ్యలగూడెం, తూప్రాన్‌పేట, ఆందోల్‌మైసమ్మ గుడి,కొత్తగూడెంలలో రోడ్‌షోలతో కూడిన పాదయాత్ర రంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించి 7న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగే ముగింపు సభకు చేరుకుంటుంది.
పాదయాత్రకు విద్యార్థులు, మేథావులు, రైతులు, కార్మికులు, ప్రజలను, ఉద్యోగులను చైతన్యపరుస్తూ ముందకు సాగుదుందని తెలంగాణ విద్యార్ధి మహాపాదయాత్ర నిర్వాహకులు తెలియజేశారు.
మహాపాదయాత్రకు బీజేపీ మద్దతు నల్లగొండ కల్చరల్ తెలంగాణ విద్యార్ధి మహాపాదయాత్రకు బీజేపీ పూర్తి మద్దతు ఇస్దుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరెల్ల చంద్రశేఖర్ అన్నారు. నల్లగొండలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కోదాడలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే మహాపాదయాత్రకు జిల్లా నుంచి ఏబీవీసీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్ళాలని పిలుపునిచ్చారు. మహాపాదయాత్రకు విద్యార్థులు, మేథావులు, రైతులు, కార్మికులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.