నేటి నుంచి చేప మందు పంపిణీ
– భారీగా ఏర్పాట్లు
హైదరాబాద్,జూన్ 7(జనంసాక్షి): చేప మందు కోసం వచ్చే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీసీపీ కమలాసన్ రెడ్డి హెచ్చరించారు. కమలాసన్ రెడ్డి విూడియాతో మాట్లాడుతూ చేప మందు కోసం హైదరాబాద్ కు భారీగా జనం తరలివచ్చారని తెలిపారు. బుధవారం మధ్యాహ్నం తర్వాత చేప మందు పంపిణీ ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు చేప మందు పంపిణీకి హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర ఫిషరీష్ శాఖ ఆధ్వర్యంలో అస్తమా వ్యాధిగ్రస్తులకు ఇప్పటికి సుమారు 40వేల కొర్రవిూన్ల చేపపిల్లలను అందుబాటులో ఉంచారు. కొర్రవిూన్ల కొనుగోలుకు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో 32 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇందులో మహిళలకు, వికలాంగులకు, వృద్ధులకు, ప్రముఖులకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఒక్కో కొర్రవిూన్‌ను రూ.15కు విక్రయించనున్నారు. తొక్కిసలాట జరగకుండ క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. చేపట్టనున్న చేప మందు పంపిణీకి హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర ఫిషరీష్ శాఖ ఆధ్వర్యంలో అస్తమా వ్యాధి గ్రస్తులకు ఇప్పటికి సుమారు 40వేల కొరవిూన్లను అందుబాటులో ఉంచారు. ఇందులో మహిళలకు, వికలాంగులకు, వృద్ధులకు, ప్రముఖులకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఒక్కో చేపను రూ.15కు అమ్మనున్నారు. తొక్కిసలాట జరగకుండ క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. రద్దీ దృష్ట్యా 1500 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాట్లు చేశామన్నారు.