నేటి నుంచి పీజీ ప్రథమ సెమిస్టర్ పరీక్షలు
గణేశ్‌నగర్, (జనంసాక్షి): శాతవాహన విశ్వవిద్యాలయం పీజీ ప్రథమ సెమిస్టర్ బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఇందుకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేపట్టారు. మొత్తం 2,499 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకు జిల్లా కేంద్రంలో నాలుగు, గోదావరిఖని, జగిత్యాల, హుస్నాబాద్, హుజూరాబాద్‌లో ఇకటి చొప్పున మొత్తం 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని పరీక్షల నియంత్రణాధికారి టి. భరత్ తెలిపారు. ప్రథమ సెమిస్టర్‌కు సంబంధించి విద్యార్ధుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశామన్నారు.