నేటి నుండి నట్టల నివారణ పంపిణీ
కందుకూరు ్, జూలై 16 (ఎపిఇఎంఎస్): ఈ నెల 16 నుండి మండల పరిధిలోని మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు మండల పశువైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. ఈ నెల 16 నుండి 30 వరకు 15 రోజుల పాటు ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో నట్టల నివారణ మందు పంపిణీ చేయబడుతుందని ఆయన తెలిపారు. ప్రతి సంవత్సరం జూన్, జులై, డిసెంబర్ నెలల్లో నట్టల నివారణ మందు పంపిణీ చేయబడుతుందని ఆయన తెలిపారు. ఈ మందు వలన గొర్రెలు, మేలు, గొర్రెపిల్లలు, మేకపిల్లల్లోని క్రిములు నశించి వ్యాధులను దూరం చేస్తాయని ఆయన తెలిపారు. కావున మేకలు, గొర్రెల కాపరులు తమ మేకలు గొర్రెలకు తప్పనిసరిగా నట్టల నివారణ మందును వేయించాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం మండలంలోని మాచవరం గ్రామంలో ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందని ఆయన తెలిపారు.