నేటి మానవ ప్రగతికి విద్య ఆధారం.

బాబురావు మున్సిపల్ వైస్ చైర్మన్.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై24(జనంసాక్షి):
విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది
వారిలో సృజనాత్మకతను పెంపొందించాల ని భావిభారత పౌరులుగా తయారు చేయాలని నైతిక విలువలను పెంపొందిస్తూ సమాజ ప్రగతికి తోడ్పడే విధంగా తీర్చిదిద్దాలని మున్సిపల్ వైస్ చైర్మన్ బాబురావు ఉపాధ్యాయులను కోరారు. జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశువు దిల్ పాఠశాలలో జరిగిన పూర్వ పాలమూరు జిల్లాలోని శిశు మందిరాల ఉపాధ్యాయు లకు రెండు రోజుల శిక్షణా కార్యక్రమంలో భాగంగా ఆదివారం జరిగిన ముగింపు సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బాబురావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పాలమూరు విభాగ్
కుంటి ఎల్లప్ప ముఖ్య వక్తగా విచ్చేసి విద్యార్థికి చదువుతోపాటు దేశభక్తి క్రమశిక్షణ నైతిక విలువలను పెంపొందించే టట్లు ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు.సమావేశంలో జిల్లా అధ్యక్షులు మిడిదొడ్డి శివశంకర్,పాఠశాల అధ్యక్షులు వాసా రమేష్ బాబు, సాయిబాబు, కొండయ్య, జిల్లా కార్యదర్శి బాలరాజు, నాగరాజు, శ్రీనివాస్ గౌడ్, ప్రవీణ్ రెడ్డి, చంద్రశేఖర గుప్త, ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీ ప్రసన్న,పాఠశాల ప్రబంధ కారిణి, సభ్యులు,పూర్వ విద్యార్థులు పోషకులు పాల్గొన్నారు.