నేడు అంతర్జాతీయ యోగా దినం

1

– సూర్య నమస్కార పోస్టల్‌ స్టాంపు విడుదల చేసిన మోదీ

న్యూఢిల్లీ,జూన్‌ 20(జనంసాక్షి): అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా యోగా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. జూన్‌ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మంగళవారం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలు చేపట్టారు. ప్రధాని మోడీ సహా కేంద్రమంత్రులు దేశవ్యాప్తంగా జరిగే కార్యక్రమా/-లో వివిధ ప్రాంతాల్లో పాల్గొంటారు. ప్రధాని మోడీ ఛండీగడ్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. యోగా గురు రాందేవ్‌ బాబు ఢిల్లీలో కార్యక్రమం చేపట్టారు. ఇక యోగా దినోత్సవానికి దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సిద్ధమవుతున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు లక్ష యోగా కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. దేశంలోని వారణాసి, ఇంఫాల్‌, జమ్ము, సిమ్లా, వడోదర, లఖ్‌నవూ, బెంగళూరు, విజయవాడ, భువనేశ్వర్‌, ¬షియార్‌పూర్‌ పది ప్రాంతాల్లో మెగా ఈవెంట్స్‌ జరగనున్నాయి. చండీగఢ్‌లో జరిగే యోగా కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. ప్రపంచానికి భారత్‌ ఇచ్చిన విలువైన బహుమతుల్లో యోగా ఒకటని  ఆస్టేల్రియా ప్రధాని మాల్కమ్‌ టర్న్‌బుల్‌ అన్నారు.  యోగాకు పెరుగుతున్న ఆదరణకు ఈ మాటే ఒక నిదర్శనం. ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ కోసం 2014 సెప్టెంబరులో ఐరాస సర్వసభ్య సమావేశాల్లో మోదీ పిలుపునివ్వటంతో జూన్‌ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించాలని ఐరాస ప్రకటించింది. అలా మొదలైన అంతర్జాతీయ యోగా దినోత్సవం గత ఏడాది వేడుకగా సాగింది. ఏడాది వ్యవధిలో ఈ పరిస్థితిలో మరింత మార్పు వచ్చింది. గతానికి మించి మరింత వేడుకగా యోగా దినోత్సవాన్ని జరుపుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు సిద్ధమవుతున్నాయి. చండీగఢ్‌లో వేలాది మందితో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆసనాలు వేస్తుంటే.. ఐరోపా పార్లమెంటులో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌ ప్రారంభించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 100 దేశాల్లో ‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’ యోగా దినోత్సవాన్ని నిర్వహించనుంది.  యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు వీలుగా ఇప్పటికే పలు దేశాల్లో ఏర్పాట్లు చేశారు. ఇదిలావుంటే సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేక పోస్టల్‌ స్టాంపులను విడుదల చేశారు. దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ‘సూర్య నమస్కార్‌’ పేరుతో ఉన్న ఈ పోస్టల్‌ స్టాంప్స్‌లో 12 రకాల యోగాసనాలు వేస్తున్న స్టాంపులు ఉన్నాయి. వీటిలో ఆరు స్టాంపుల ఖరీదు రూ.25 కాగా మరో ఆరు స్టాంపుల ఖరీదు రూ.5. ఈ కార్యక్రమంలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీపాద యశోనాయక్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు సెలవు రోజు కాదని ప్రభుత్వం స్పష్టంచేసింది. రెండో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులంతా స్వచ్ఛందంగా యోగా కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రభుత్వం వెల్లడించింది. 21న మంగళవారం  సెలవు రోజు కాదని.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తెరిచి ఉంటాయని కేంద్ర పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ శాఖ సీనియర్‌ అధికారి వెల్లడించారు. ఉద్యోగులు యోగా కార్యక్రమాల్లో పాల్గొనాలని నిబంధనేవిూ లేదని.. స్వచ్ఛందంగా పాల్గొనవచ్చని తెలిపారు.