నేడు ఆర్థిక, మంత్రి తన్నీరు హరీష్ రావు రాక
జహీరాబాద్ సెప్టెంబర్ 23( జనం సాక్షి )జహీరాబాద్ పర్యటనలో భాగంగా మంత్రి హరీష్ రావు జహీరాబాద్ కు రానున్నారు. మంత్రి పర్యటన కు స్థానిక శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు మంత్రి పర్యటనకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఆలాగే పర్యంటించబోయే రూట్ మ్యాప్ నీ పోలీస్ అధికారులకు వివరించడం జరిగింది. ఆయన వెంట స్థానిక నాయకులు పోలీస్ సిబ్బంది, వివిధ శాఖలకు చెందిన అధికారులు ఉన్నారు.