నేడు కొత్త ఐటీ పాలసి ఆవిష్కరణ

5
– అధికారకంగా ప్రకటించనున్న సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 3(జనంసాక్షి):కొత్త ఐటీ పాలసీ ప్రకటనకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. సోమవారం నాడు హెచ్‌ఐసీసీ వేదికగా సీఎం కేసీఆర్‌ కొత్త ఐటీ పాలసీని ప్రకటించనున్నారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీతో పాటు దాని అనుబంధ రంగాలకు సంబంధించిన మరో 4 పాలసీలను కూడా సీఎం ఆవిష్కరించనున్నారు. వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ లాంటి ద్వితీయ శ్రేణి నగరాలతో పాటు.. తృతీయశ్రేణి నగరాల్లో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు స్పెషల్‌ ఇన్సెంటివ్స్‌ ఇచ్చేలా కొత్త పాలసీని తీసుకొస్తున్నారు.

ఇప్పటికే ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఐటీ ఉత్పత్తుల ఎగుమతులను రెట్టింపు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం 62 వేల కోట్లుగా ఉన్న ఐటీ ఎక్స్‌ పోర్ట్స్‌ ను రాబోయే ఐదేళ్లలో 1 లక్షా 25 వేల కోట్ల రూపాయలకు తీసుకెళ్లాలన్నది టార్గెట్‌! ఇందుకోసం ఇన్వెస్టర్లకు ప్రభుత్వం పలు రాయితీలు ప్రకటించనుంది. 25 శాతం నుంచి 50 శాతం వరకు ఫిక్స్‌ డ్‌ క్యాపిటల్‌ సబ్సిడీని అందించే విధంగా కొత్త ఐటీ పాలసీని తీసుకురానుంది. సంస్థల స్థాయిని బట్టి విద్యుత్‌ రాయితీలు, మున్సిపల్‌, పంచాయితీ పన్నుల్లో ప్రత్యేక మినహాయింపు ఇచ్చేలా చర్యలు తీసుకోనుంది. వీటితోపాటు కంపెనీలకు ఇంటర్నెట్‌ లాంటి మౌలిక సదుపాయాలను కూడా ప్రభుత్వమే కల్పించనుంది. సిబ్బందిని హైర్‌ చేయడంతోపాటు, ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడంలో కూడా కంపెనీలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందించనుంది

స్టార్టప్‌ కంపెనీలను ఆకర్షించేందుకు ఇన్నోవేషన్‌ పేరిట మరో కొత్త పాలసీని రూపొందిస్తున్నారు. యువ ఆంట్రప్రెన్యూర్ల వినూత్న ఆలోచనలను ప్రోత్సహించి, స్టార్టప్‌ కంపెనీలకు అనువైన వాతావరణం సృష్టించేందుకు ప్రత్యేక రాయితీలను ప్రకటించనుంది. . స్టార్టప్‌ కంపెనీల కోసం రెండు వేల కోట్ల ఆర్థిక సాయం అందించాలని కూడా పాలసీలో ప్రకటించనున్నారు. ఇక ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల కోసం తెలంగాణ సర్కార్‌ ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్‌ సిస్టం డిజైన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఇూఆఓ పాలసీని తీసుకురానుంది. దీనిద్వారా ఎలక్ట్రానిక్‌ రంగ ఉత్పత్తులను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని నిర్ణయించింది. మరిన్ని స్పెషల్‌ ఇన్సెంటివ్స్‌ ప్రకటించడం ద్వారా భారీగా పెట్టుబడులు ఆకర్షించి, ఎలక్ట్రానిక్‌ రంగ ఉత్పత్తుల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఐటీ సెక్టార్‌ లో యానిమేషన్‌ అండ్‌ గేమింగ్‌ ఇండస్ట్రీది ప్రత్యేక స్థానం. రాబోయే రోజుల్లో వీటికి మరింత డిమాండ్‌ పెరగనుండటంతో తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా దృష్టి సారించింది. కొత్తగా యానిమేషన్‌ అండ్‌ గేమింగ్‌ పాలసీని ప్రకటించి రాయితీలు ఇవ్వనుంది. ఇక గ్రావిూణ ప్రాంతాల్లో ఐటీ పరిశ్రమ విస్తరణకు కూడా ప్రభుత్వం ఒక పాలసీని రూపొందిస్తోంది. రూరల్‌ టెక్‌ పేరిట ఈ కొత్త పాలసీని ప్రకటించనుంది. దీనిద్వారా రూరల్‌ బీపీవోల ఏర్పాటు పై ప్రత్యేకంగా దృష్టి పెట్టనుంది. స్పోకెన్‌ ఇంగ్లీష్‌, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ల అవసరం లేకుండా.. కేవలం ఇంటర్మీడియట్‌ విద్య, తెలుగు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ తో కాల్‌ సెంటర్లలో ఉపాధి అవకాశాలు లభించేలా కొత్త విధానాన్ని రూపొందిస్తోంది. దీనికోసం ప్రతీ జిల్లాకో రూరల్‌ టెక్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనుంది. మొదటి దశలో జిల్లాకు 2 వేల 5 వందల మంది చొప్పున మొత్తం 25 వేల మందికి ఉపాధి కల్పించాలని సర్కార్‌ లక్ష్యంగా పెట్టుకుంది. జిల్లాకు 10 వేల మంది గ్రావిూణ యువకులకు టాస్క్‌ సంస్థ ద్వారా శిక్షణ అందించనుంది. డేటా ప్రాసెసింగ్‌, డేటా ఎంట్రీ, డేటా మేనేజ్‌ మెంట్‌, డాక్యుమెంట్‌ డిజిటైజేషన్‌, కస్టమర్‌ సర్వీసెస్‌, హెచ్‌ఆర్‌, ఫైనాన్స్‌, లీగల్‌ సర్వీసెస్‌, ఈ-సర్వీసెస్‌ తదితర సేవలు లభ్యమయ్యేలా రూరల్‌ టెక్‌ పాలసీని రూపొందిస్తున్నారు.

స్టార్ట్‌ అప్‌ కంపెనీలను ఆకర్షించేలా ఐటీ పాలసీ

ఎక్స్‌ పోర్ట్స్‌ లో రెట్టింపు వృద్ధిరేటు సాధించాలనే లక్ష్యంతో.. కొత్త ఐటీ పాలసీ తెస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఔత్సాహికులకు ఐటీ రంగ పెట్టుబడుల్లో.. భారీ రాయితీ అందించే విధంగా పాలసీ ఉండబోతోంది. రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి నగరాలు, గ్రావిూణ ప్రాంతాల్లో.. ఐటీ పరిశ్రమ విస్తరణే ధ్యేయంగా ప్రభుత్వం ఐటీ విధానాన్ని రూపొందించింది. ఈ కొత్త పాలసీని గవర్నర్‌, సీఎంలు రేపు ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీయల్‌ పాలసీ తీసుకొచ్చిన ప్రభుత్వం.. ప్రస్తుతం ఐటీ రంగంపై దృష్టిపెట్టింది. హైదరాబాద్‌ ఊఎఅఅలో రేపు సాయంత్రం కొత్త ఐటీ పాలసీని.. గవర్నర్‌ నరసింహన్‌, సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించబోతున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌ తోపాటు.. ఇన్ఫోసిస్‌ చైర్మన్‌ నారాయణమూర్తి హాజరుకానున్నారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీతో పాటు దాని అనుబంధ రంగాలకు సంబంధించిన మరో 4 విధానాలను కూడా సీఎం ఆవిష్కరిస్తారు. వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ లాంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు.. స్పెషల్‌ ఇన్సెంటివ్స్‌ ఇచ్చేలా కొత్త పాలసీ తయారు చేశారు. స్టార్ట్‌ అప్‌ కంపెనీలను ఆకర్షించేందుకు ఇన్నోవేషన్‌ పేరిట పాలసీని రూపొందిస్తున్నారు. యువత వినూత్న ఆలోచనలను ప్రోత్సహించి, స్టార్ట్‌ అప్‌ కంపెనీలకు అనువైన వాతావరణం సృష్టించేందుకు.. ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ప్రకటించనుంది. స్టార్ట్‌ అప్‌ కంపెనీలకు అంతర్జాతీయ సంస్థల నుంచి.. 2 వేల కోట్ల వరకు ఆర్థిక సాయం అందేలా.. ఐటీ విధానం ఉండబోతోంది. ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్‌ సిస్టమ్‌ డిజైన్‌ అండ్‌ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ పాలసీని తీసుకురానుంది. పెట్టుబడులు ఆకర్షించి ఎలక్ట్రానిక్‌ రంగ ఉత్పత్తుల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలన్నది ప్రభుత్వం లక్ష్యం. ఇందుకోసం ఎలక్ట్రానిక్‌ సిస్టం డిజైన్‌ డ మాన్యుఫ్యాక్చరింగ్‌ పాలసీని తెస్తోంది.  ఐటీ రంగంలో యానిమేషన్‌ అండ్‌ గేమింగ్‌ ఇండస్ట్రీ ది ప్రత్యేకస్థానం. రాబోయే రోజుల్లో వీటికి మరింత డిమాండ్‌ పెరగనుండటంతో ప్రభుత్వం దీనిపై దృష్టిపెట్టింది. యానిమేషన్‌ అండ్‌ గేమింగ్‌ పాలసీని ప్రకటించి రాయితీలు ఇవ్వనుంది. గ్రావిూణ ప్రాంతాల్లో ఐటీ పరిశ్రమ విస్తరణకు కూడా ప్రభుత్వం విధానాన్ని రూపొందిస్తోంది. రూరల్‌ టెక్‌ పేరిట పాలసీని తెస్తోంది. ఇప్పటికే ప్రాచుర్యంలో ఉండి అంతగా అమలులో లేని.. రూరల్‌ బీపీవో ల ఏర్పాటు పై ప్రత్యేకంగా దృష్టిసారించనుంది. స్పోకెన్‌ ఇంగ్లీష్‌, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ల అవసరం లేకుండా, కేవలం ఇంటర్మీడియట్‌ విద్యతో, తెలుగు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ తో.. కాల్‌ సెంటర్లలో ఉపాధి అవకాశాలు లభించేలా విధానాన్ని రూపొందిస్తోంది. ప్రతీ జిల్లాకో రూరల్‌ టెక్‌ సెంటర్‌ ఏర్పాటు చేసేలా పాలసీ ప్రకటించనుంది ప్రభుత్వం. ఫస్ట్‌ ఫేస్‌ లో జిల్లాకు 2వేల 5 వందల మంది చొప్పున.. మొత్తం 25వేల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోనుంది. ఇందుకోసం జిల్లాకు 10 వేల మంది గ్రావిూణ యువకులకు టాస్క్‌ ద్వారా శిక్షణ అందించేందుకు ఏర్పాట్లు చేయనుంది. డేటా ప్రాసెసింగ్‌, డేటా ఎంట్రీ, డేటా మేనేజ్‌ మెంట్‌, డాక్యుమెంట్‌ డిజిటలైజేషన్‌, సౌండ్‌ ఎఫెక్ట్‌, కస్టమర్‌ సేవలు, హెచ్‌ఆర్‌, ఫైనాన్స్‌, లీగల్‌ సర్వీసెస్‌, ఈ-సర్వీసెస్‌ వంటి సేవలు వీటిలో లభించేలా రాష్ట్ర రూరల్‌ టెక్‌ పాలసీ ఉండబోతోంది. ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల్లో రెట్టింపు వృద్ధిరేటు సాధించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుతం 62వేల కోట్ల రూపాయల ఐటీ ఎగుమతులు ఉన్నాయి. రాబోయే ఐదేళ్లలో దీన్ని లక్షా 25 వేల కోట్లకు తీసుకెళ్లాలని ప్లాన్‌ చేస్తోంది. ఇందుకోసం ఇన్వెస్టర్లకు రకరకాల రాయితీలు ప్రకటించనుంది. తక్కువలో తక్కువ 25 నుంచి 50 శాతం వరకు ఫిక్స్‌ డ్‌ క్యాపిటల్‌ సబ్సిడీని అందించేలా కొత్త ఐటీ పాలసీ తేబోతోంది. సంస్థల స్థాయిని బట్టి.. విద్యుత్‌ రాయితీలు, మునిసిపల్‌, పంచాయితీ పన్నుల్లో ప్రత్యేక మినహాయింపులు ఇవ్వనుంది. వీటితోపాటు కంపెనీలకు ఇంటర్నెట్‌ లాంటి మౌళిక సౌకర్యాలను కూడా ప్రభుత్వమే కల్పించనుంది. సిబ్బందిని హైర్‌ చేయడంతోపాటు, ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడంలో కూడా కంపెనీలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందించనుంది.