నేడు ఖమ్మంకు కేంద్రమంత్రి గడ్కరీ

ఖమ్మం, మార్చి 31 : కేంద్ర, జాతీయ రహదారులు, షిప్పింగ్‌ శాఖామంత్రి నితిన్‌గడ్కరీ బుధవారం ఖమ్మం జిల్లాకు రానున్నారు. ఉదయం 10.25 గంటలకు భద్రాచలం చేరుకోనున్న కేంద్రమంత్రి అక్కడ గోదావరి నదిపై నూతన బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం సత్తుపల్లి నియోజకవర్గంలోని పెనుబల్లికి చేరుకుని రుద్రంపూర్‌ వద్ద జాతీయ రహదారుల నిర్మాణ పనులకు శంకుస్ధాపన చేస్తారు.