నేడు చుంచనకోటలో వికలాంగుల బస్సు పాస్ మేళా – జనగామ డిపో మేనేజర్ లక్ష్మారెడ్డి చేర్యాల (జనంసాక్షి) జూన్ 23 : నేడు చేర్యాల మండలంలోని చుంచనకోట గ్రామంలో ఉదయం 9గంటలకు గ్రామపంచాయతీ వద్ద కౌంటర్ ఏర్పాటు చేసి వికలాంగులకు బస్సు పాస్ మేల ఏర్పాటు చేస్తున్నట్లు జనగామ డిపో మేనేజర్ లక్ష్మా రెడ్డి, సీఆర్సీ కిషన్, తెలంగాణ వికలాంగుల వేదిక సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు సుతారి రమేష్ లు తెలిపారు. అర్హులైన వికలాంగులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. సంబంధిత పత్రాలు సదరం సర్టిఫికెట్, ఆధార్ కార్డు జిరాక్సులు,2 పాస్ ఫోటోలు గ్రామపంచాయతీ వద్దకు తీసుకుని బస్సు పాస్ మేలను వికలాంగులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
కేసీఆర్ కు పేద ప్రజల ఉసురు తగులుతుంది*
*ప్రాజెక్ట్ ల పేరుతో కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు*
*కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఒకట్టే*
*బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్*
రేగొండ,(జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, టిఆర్ఎస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేసి బ్రష్టు పట్టించారు అని బి ఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బహుజన రాజ్యాధికార యాత్ర 97వ రోజు గురువారం రేగొండ మండలం గోరి కొత్తపల్లి, చిన్న కొడే పాక, చెన్న పూర్, రేగొండ, బాగిర్తిపేట, మడ్త పల్లి , పొనగల్లు, రెపాక గ్రామాల్లో సాగింది. బి ఎస్ పి జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు రాదండి దేవేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్రలో భాగంగా రేగొండ మండల కేంద్రంలో బీఎస్పీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బి ఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. అనవసరమైన ప్రాజెక్టులను టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. కాలేశ్వరం, మిషన్ భగీరథ ఇలాంటి పథకాల లో కోట్ల రూపాయల నిధులను ముఖ్యమంత్రి కేసీఆర్ కజేశరని చేశారని ఆయన ఆరోపించారు. ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు విచారణ చేపట్టడం లేదని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రహస్య ఒప్పందం చేసుకున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఒకటేనని ప్రజలు గమనించాలని అన్నారు. ప్రజలను మభ్యపెట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు దోచుకుంటున్నారని అన్నారు. అటవీ ప్రాంతాల్లో ప్రజలు దీనస్థితిలో జీవనం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజలకు ఇచ్చిన అసైన్డ్ భూములను లవర్ భూములను ప్రభుత్వం పథకాల పేరుతో లాక్కుంటుంది అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు పేద ప్రజల ఉసురు తాకుతుంది అని అన్నారు. 2016లో డబుల్ బెడ్ రూమ్ పథకం పేరుతో విడుదల చేసిన 16 వేల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయావు అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేదని అన్నారు. ఎక్కడో ఒకచోట పునాదులు వరకు నిర్మించి చేతులు దులుపుకున్నారు అని అన్నారు. మిషన్ భగీరథ పేరుతో కోట్ల రూపాయలు అక్రమాలకు పాల్పడ్డారని ఇప్పటికి ఎక్కడ కూడా నీళ్లు రాక మంచినీళ్లకు ఇబ్బందులు పడుతున్న గ్రామాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. బాసర లో తొమ్మిది వేల మంది విద్యార్థులు సరైన సౌకర్యాలు లేవని ఆందోళన చేస్తుంటే కనీసం పలకరించని ముఖ్యమంత్రి ఎందుకు ఉన్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కసారి కూడా విద్యా వ్యవస్థ పై సమీక్ష నిర్వహించకుండా విద్యా వ్యవస్థను కూని చేస్తున్నాడని ఆరోపించారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పోడు భూములకు, అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని అన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం బి ఎస్ పి పార్టీ 60 నుంచి 70 మంది బీసీలకు, 14 మంది ముస్లింలకు సీట్లు కేటాయిస్తామని తెలిపారు. దమ్ముంటే మిగతా పార్టీలు జనాభా నిష్పత్తి ప్రకారం సీట్లు కేటాయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బి ఎస్ పి నాయకులు పొన్నం భిక్షపతి గౌడ్, డాక్టర్ సధన్, కొయ్యడ దామోదర్, గడ్డం రాజేష్, ఈర్ల సురేష్, భాస్కర్, ప్రవీణ్, రమేష్, రవి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.