నేడు జాతిపిత జయశంకర్‌సార్‌ జయంతి

5

హైదరాబాద్‌,ఆగస్టు 5(జనంసాక్షి):ఆచార్య జయశంకర్‌ సార్‌ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జయశంకర్‌సార్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆదేశాలు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జయంతిని ఘనంగా జరపాలని ఆదేశించారు. రాష్ట్ర పండగగా ఇప్పటికే ప్రకటించినందున అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని సూచించారు. గ్రామస్థాయి వరకు అన్ని కార్యాలయాలు, విద్యాసంస్థల్లో సార్‌కు నివాళులర్పించాలని తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు వెల్లాయి. ఆయా జిల్లాల్లో అనేక కార్యక్రమాలు చేపట్టనున్నారు.