నేడు జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): నేడు జిల్లా కేంద్రంలోని రవి మహల్ ఏసీ కన్వెన్షన్ హల్ లో జరిగే సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జిల్లాలోని ఆర్యవైశ్యులందరూ అధిక సంఖ్యలో పొల్గొని విజయవంతం చేయాలని ఆ సంఘ జిల్లా అధ్యక్ష , కార్యదర్శులు మాశెట్టి అనంతరాములు, బండారు రాజాలు కోరారు.శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు.ఆర్యవైశ్యుల ఐక్యతను, సత్తాను చాటేందుకు జిల్లాలోని ఆర్యవైశ్యులందరూ ఈ కార్యక్రమానికి భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు.ముఖ్య అతిథులుగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు, తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అమరవాది లక్ష్మీనారాయణ,రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్,ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్  శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తో పాటు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్ లు హాజరు కానున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో ఆ సంఘ జిల్లా ఉపాధ్యక్షులు గుండా రమేష్ బాబు, బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.