నేడు ఢిల్లీ ఎన్నికలు

2

సర్వం సిద్ధం

ఆప్‌కు బుఖారీ మద్దతు

మీ మద్దతు మాక్కర్లేదు..హిందూముస్లింలు మావాళ్లే

మతప్రాతిపదికన ఎన్నికలొద్దు..అరవింద్‌ కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ,ఫిబ్రవరి6(జనంసాక్షి): హస్తిన ఎన్నికల పోరుకు రంగం సిద్ధమైంది. న్యూఢిల్లీ శాసనసభకు శనివారం జరుగనున్న ఎన్నికలకు ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లు చేసింది. భారీగా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం పోలింగ్‌ కేంద్రాల వదద్‌ భారగీ బందోబస్తు ఉంటుందని ఇసి తెలిపింది. అలాగే పోలింగ్‌ కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు విధించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడం, ఏడాదిలోగానే మళ్లీ ఎన్నికలకు వెల్లాల్సి వచ్చింది. ఆప్‌ నేత కేజ్రీవాల్‌ కాంగ్రెస్‌ మద్దతుతో 47 రోజుల అధికారం తరవాత  రాష్ట్రపతి పాలన విధించారు. తిరిగి సుప్రీం ఆదేశాలతో ఎన్నికలకు ఇసి పూనుకుంది. అత్యంత ¬రా¬రీగా సాగుతున్న దిల్లీ శాసనసభ ఎన్నికల ప్రచార పర్వానికి గురువారం సాయంత్రం తెరపడింది. చివరి రోజైన గురువారం అన్ని పార్టీల నేతలు భారీ ఎత్తున ప్రచారం చేపట్టారు.

ఇక దిల్లీ ఎన్నికల్లో ముస్లిం మతపెద్ద షాహీ ఇమామ్‌ మద్దతుని ఆప్‌ తిరస్కరించింది. ముస్లింలందరూ ఆమ్‌ఆద్మీ పార్టీకి ఓటు వేయాలంటూ షాహీ ఇమామ్‌ ప్రజలను కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆప్‌ నేత సంజయ్‌ సింగ్‌ మాట్లాడుతూ తమ పార్టీ మతరాజకీయాలకు ఎప్పుడూ వ్యతిరేకమేనని తెలిపారు. అన్ని మతాల వారి ఓట్లు మాకు కావాలని, ప్రత్యేకంగా ఇమామ్‌ మద్దతు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

ఎన్నికల కోసం ప్రచారం ముగిసిన తర్వాత వివిధ పార్టీల కార్యకర్తలు 70 నియోజకవర్గాల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. గత 16 సంవత్సరాలుగా దిల్లీ రాష్ట్రంలో అధికారానికి దూరంగా ఉన్న భాజపా ఆన్నాబృందం మాజీ సభ్యురాలు కిరణ్‌బేడీని తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దించి గొప్ప రాజకీయ ఎత్తుగడను వేసింది. భాజపా వ్యూహాన్ని ఎదుర్కొనేందుకు, మోదీ శక్తిని నిలువరించేందుకు అరవింద్‌ కేజీవ్రాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్‌) ఉద్ధృత ప్రచారాన్ని చేపట్టింది. కొన్ని సర్వేలు ఆప్‌ గెలుస్తుందని చెప్పగా, మరికొన్ని భాజపాకే ఆధిక్యాన్ని కట్టబెట్టాయి. ఇదిలావుంటే దిల్లీ పోలీసులు భాజపా ఒత్తిడితో పనిచేస్తున్నారని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజీవ్రాల్‌ దిల్లీలో విలేకరులతో మాట్లాడారు. భాజపా ఒత్తిడితో తమ అభ్యర్థులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉత్తమ్‌నగర్‌ ఆప్‌ అభ్యర్థి వద్ద మద్యం సీసాలు లభించడం వెనక కూడా భాజపా కుట్ర ఉందని ఆరోపించారు.